చెల్లికి న్యాయం కోసం ఏపీ నుండి ఢిల్లీకి ఎడ్లబండిపై ప్రయాణం; తల్లితో కలిసి ఓ అన్న పోరాటం!!
ఓ చెల్లెలు పడుతున్న కష్టాలను చూడలేక ఓ అన్న తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అత్తింటి వేధింపులు భరించలేక పుట్టింటికి వచ్చిన చెల్లెల్ని చూసి కుమిలిపోయిన ఓ అన్న పోరాటానికి సిద్ధమైన తీరు అందర్నీ ఆలోచించేలా చేస్తోంది. ఎడ్లబండిపై కుటుంబ సభ్యులతో కలిసి దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లి అక్కడ సుప్రీంకోర్టులో, మానవ హక్కుల కమిషన్ లో తన చెల్లి కోసం న్యాయ పోరాటం చేయాలని నిర్ణయించుకున్న అన్న ఎడ్లబండిపై రాష్ట్రాలను దాటుతూ ప్రయాణం సాగిస్తున్నాడు. తన చెల్లి కి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాడు.

అత్తారింట చెల్లికి వేధింపులు.. న్యాయం కోసం ఢిల్లీకి వెళ్తున్న అన్న
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ముప్పాళ్ళ గ్రామంలో యువకుడు నేలవెల్లి నాగ దుర్గా రావు తన సోదరి నవ్యతను అదే మండలంలోని చందాపురం గ్రామానికి చెందిన కొంగర నరేంద్రనాథ్ కిచ్చి 2018 లో వివాహం చేశారు. ఇక కట్నంగా 23 లక్షల రూపాయల నగదు, 320 గ్రాముల బంగారం, మూడు ఎకరాల పొలం ఇచ్చామని, అయినా నవ్వి తన భర్త అత్తమామలు నిత్యం వేధిస్తున్నారంటూ వాపోతున్నారు. ఈ క్రమంలోనే తన కుటుంబ సభ్యులతో కలిసి తన చెల్లెలుకు న్యాయం కోసం ఎడ్లబండిపై ఢిల్లీ యాత్ర ప్రారంభించానని చెప్తున్నారు.

చెల్లెలికి భర్త, అత్తమామల వేధింపులు, కేసు పెట్టినా చర్యలు లేవన్న అన్న
ఈనెల 23వ తేదీన తల్లి జ్యోతి తో కలిసి ఎడ్లబండిపై ఢిల్లీకి బయలుదేరిన నాగ దుర్గారావు ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో తన ప్రయాణాన్ని సాగిస్తున్నారు. తన సోదరి నవ్యతకు వివాహం చేసిన తర్వాత భర్త సక్రమంగా లేడని, అత్తింటివారు నవ్యతను బెదిరించి తెల్ల కాగితాల పై సంతకాలు చేయించుకున్నారని, ఆపై ఆమెను నిత్యం వేధిస్తూ ఉండడంతో పుట్టింటికి వచ్చేసిందని నాగ దుర్గారావు చెబుతున్నారు. నవ్యతను అత్త వారి కుటుంబం వేధించడంపై చందర్లపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని, కేసు నమోదు చేసుకుని పోలీసులు చర్యలు తీసుకుంటారు అనుకుంటే, నవ్యత అత్తమామలు తమ పరపతిని ఉపయోగించి కేసును ముందుకు కదలనివ్వడంలేదని పేర్కొన్నారు.

ఏపీలో న్యాయం జరగదని ఢిల్లీకి .. సుప్రీంకోర్టులో, హెచ్ఆర్సీలో ఫిర్యాదు చెయ్యనున్న అన్న
ప్రస్తుతం కేసులో ఎలాంటి పురోగతి లేకపోవడంతో, దీంతో తాము విసిగిపోయామని అందుకే ఢిల్లీలో న్యాయం కోసం పోరాటం చేయాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో న్యాయం జరగదని భావించి, తన తల్లితో కలిసి ఎడ్లబండిపై ఢిల్లీ చేరుకుని సుప్రీంకోర్టులోనూ, హ్యూమన్ రైట్స్ కమిషన్ లోనూ తన చెల్లికి జరుగుతున్న అన్యాయంపై ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నట్టు నాగ దుర్గారావు తెలిపారు. అక్కడ తమకు న్యాయం జరుగుతుందని నాగ దుర్గారావు భావిస్తున్నారు.

చెల్లి కోసం అన్న పడుతున్న కష్టం .. ఆశ్చర్యపోతున్న జనం
ఒకపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలపై ఎటువంటి వేధింపులు ఉన్నా దిశ చట్టం ప్రకారం తక్షణం చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో న్యాయం జరగడం లేదంటూ ఢిల్లీ బాట పట్టిన ఓ అన్న తన చెల్లికి న్యాయం కావాలని ఎడ్ల బండి పై ప్రయాణం చేస్తున్న తీరు అందరిని ఆలోచించేలా చేస్తోంది. చెల్లి కోసం ఢిల్లీలో న్యాయపోరాటం చేస్తానన్న నాగ దుర్గారావు పోరాటపటిమను అందరూ కొనియాడుతున్నారు. చెల్లి పై అన్నకు ఉన్న ప్రేమకు ఆశ్చర్యపోతున్నారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications