గ్రేటర్ లో పోటీ.. టీడీపీని ఉతికి ఆరేస్తున్న నెటిజన్లు .. అదో గాలి పార్టీ, ఇదే రిపీట్ అన్న మంత్రి కొడాలి నానీ
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసిన టిడిపి డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోవడంపై తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చ జరుగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో టిడిపి గత ఎన్నికల సమయంలోనే తన ప్రభావాన్ని చూపించలేకపోయింది. ఇక తాజాగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేసి టిడిపి తప్పు చేసిందని భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. జనసేన పార్టీలా సైలెంట్ గా ఉన్నా పరువు దక్కేదని చాలా మంది అభిప్రాయపడుతున్నారు .

ఆంధ్రా సెటిలర్స్ కూడా ఆదరించని టీడీపీ .. గ్రేటర్ లో డిపాజిట్లు కోల్పోయి ..
గతంలో గ్రేటర్ హైదరాబాద్ లో ఒక వెలుగు వెలిగిన పార్టీ, క్షేత్రస్థాయిలో బలంగా ఉన్న పార్టీ కావడంతో ఈ ఎన్నికలలో అధికార పార్టీపై ఉన్న వ్యతిరేకత టిడిపి నేతలు తమకు కలిసొస్తుందని అనుకున్నారు. గ్రేటర్లో ఉన్న ఆంధ్రా సెటిలర్స్ అయినా తమను ఆదరిస్తారు అని భావించారు. దీంతో ఈ ఎన్నికలలో రంగంలోకి దిగారు టీడీపీ నేతలు . కానీ అన్ని అంచనాలను తలకిందులు చేస్తూ గ్రేటర్ వాసులు తీర్పు ఇచ్చారు. టీడీపీకి కనీసం డిపాజిట్లు కూడా దక్కని పరిస్థితి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పై ట్రోల్స్ కు కారణం అవుతుంది.

106 స్థానాల్లో డిపాజిట్లు కూడా రాలేదు .. అదో జాతీయ పార్టీనా : కొడాలి నానీ
సోషల్ మీడియాలో మాత్రమే కాకుండా, బయట కూడా తెలుగుదేశం పార్టీపై, పార్టీ పరిస్థితి పై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు ప్రత్యర్థి పార్టీల నాయకులు. తాజాగా ఏపీ మంత్రి కొడాలి నాని గ్రేటర్ హైదరాబాద్ లో పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ పై విమర్శలు గుప్పించారు. కనీసం 150 డివిజన్లలో టిడిపి నేతలతో పోటీ కూడా చేయించలేక పోయారని ఎద్దేవా చేశారు. పోటీ చేసిన 106 స్థానాల్లో డిపాజిట్లు కూడా దక్కలేదని, అలాంటి పార్టీ, తమ పార్టీని జాతీయ పార్టీగా ప్రకటించుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు మంత్రి కొడాలి నాని.

అదో గాలి పార్టీ , గాలినాయకుడు .. వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా కష్టమే ..
ఎన్టీఆర్ ఆత్మ క్షోభ పడేలా టిడిపిని చంద్రబాబు పతనం చేశారని విమర్శల వర్షం కురిపించిన కొడాలి నాని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ప్రతిపక్ష హోదా కూడా రాదని వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారని పేర్కొన్న ఆయన ప్రజానేత సీఎం జగన్ ను ఢీ కొడతా అనడం చంద్రబాబు అవివేకం అని అభిప్రాయపడ్డారు. టీడీపీని చంద్రబాబు గాలి పార్టీగా తయారు చేశారని ఆయన ఒక గాలి నాయకుడిగా మిగిలిపోయారు అంటూ, ఏపీలో ఎన్నికలు ఏవి వచ్చినా సరే ఇదే రిపీట్ అవుతుందని కొడాలి నాని చంద్రబాబు పై ధ్వజమెత్తారు. టిడిపి భవిష్యత్తులో ఎక్కడ పోటీ చేసినా ఫలితాలు ఇదే విధంగా ఉంటాయని చంద్రబాబును నమ్మి ఓటేసే వారెవరూ లేరని కొడాలి నాని పేర్కొన్నారు.

మీ జాతీయ పార్టీని లోకల్ జనాలు జాతికి అంకితం చేశారని సోషల్ మీడియాలో ట్రోల్స్
మరో పక్కన సోషల్ మీడియాలో కూడా టిడిపి పై ట్రోల్స్ వైరల్ గా మారాయి. హైదరాబాద్ వాళ్లకు నిద్రలేకుండా నేర్పిన మిమ్మల్ని లేవకుండా పాతేశారు కదయ్యా, హైదరాబాద్ ని వరల్డ్ మ్యాప్ లో పెట్టిన మిమ్మల్ని తెలంగాణ మ్యాప్ నుంచి చెరిపేశారు కదయ్యా, మీ జాతీయ పార్టీని లోకల్ జనాలు జాతికి అంకితం చేశారు కదయ్యా అంటూ, జయము జయము చంద్రన్న.. అని సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు. అనవసరం గా పోటీ చేసి టీడీపీ ఇబ్బంది పడుతున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. అటు సోషల్ మీడియాలో నెటిజన్లు, మరోవైపు ప్రత్యర్థి పార్టీల నాయకులు టిడిపి ని ఉతికి ఆరేస్తున్నారు .
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications