జగన్ కేసుల్లో కీలక పరిణామం-హెటిరో క్వాష్ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు

ఏపీ సీఎం వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే ఆస్తుల కేసును విచారిస్తున్న సీబీఐ ప్రత్యేక న్యాయస్ధానం ఈ కేసుల్ని కొలిక్కి తీసుకొచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అదే సమయంలో సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ణయాల్ని సవాల్ చేస్తూ ఈ కేసుల్లో నిందితులు దాఖలు చేస్తున్న క్వాష్ పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు తీర్పులు ఇవ్వడం మొదలుపెట్టింది.

జగన్ అక్రమాస్తుల కేసులో నిందితులు దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్లపై రోజువారీ విచారణ జరుపుతున్న తెలంగాణ హైకోర్టు ముందుగా హెటిరో కేసులో ఇవాళ తీర్పు ప్రకటించింది.. జగన్ సంస్ధల్లో హెటిరో గ్రూప్, వాటి డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి పెట్టుబడులు పెట్టిన అంశంపై సీబీఐ నమోదు చేసిన కేసుల్ని కొట్టేయాలంటూ క్వాష్ పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు ఇవాళ తీర్పునిచ్చింది. ఈ పిటిషన్ విచారణలో జగన్ సంస్ధల్లో పెట్టుబడులు వ్యాపార వ్యూహాల్లో భాగమేనన్న హెటిరో వాదనతో హైకోర్టు ఏకీభవించలేదు. హెటిరో గ్రూప్ కు అప్పట్లో వైఎస్ సర్కార్ చేసిన భూకేటాయింపుల్లో కూడా అక్రమాలు జరగలేదని వాదించింది. దీంతో కూడా హైకోర్టు ఏకీభవించలేదు. చివరికి హెటిరో, శ్రీనివాసరెడ్డి దాఖలు చేసుకున్న వేర్వేరు క్వాష్ పిటిషన్లను తోసిపుచ్చుతూ తెలంగాణ హైకోర్టు తీర్పు ప్రకటించింది.

ts high court verdicts begin in quash petitions in ys jagans assets cases, dismiss hetero group plea

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో అరబిందో, హెటిరో సంస్ధలకు గతంలో వైఎస్ సర్కార్ చేసిన భూకేటాయింపులు అవి జగన్ కు చెందిన సంస్ధల్లో పెట్టిన పెట్టుబడులకు ప్రతిఫలంగానే అని సీబీఐ కేసు నమోదు చేసింది. వీటిపై సీబీఐ ప్రత్యేక కోర్టులో సీబీఐ ఛార్జిషీట్ కూడా దాఖలు చేసింది. దీనిపై విచారణ సాగుతుండగానే నిందితులు హైకోర్టులో క్వాష్ పిటిషన్లు వేశారు. ఇప్పుడు హైకోర్టు వాటిని కొట్టేయడంతో సీబీఐ కోర్టులో విచారణ కొనసాగించడానికి ఇబ్బందులు తొలగిపోయినట్లయింది. ఇదే కోవలో మిగతా క్వాష్ పిటిషన్లపై కూడా త్వరలో తీర్పులు ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు సిద్దమవుతోంది. అప్పుడు సీబీఐ కోర్టులో జగన్ కేసులో దాఖలైన ఛార్జిషీట్లపై విచారణకు ఇతర ఇబ్బందులు కూడా తొలగిపోయే అవకాశముంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+