అలిపిరి మెట్ల మార్గంలో టీటీడీ ఏఈఓ నిర్వహించిన తనిఖీల్లో..

Tirumala: తిరుమలలోని అలిపిరి, శ్రీవారి మెట్లమార్గాలు, ఘాట్ రోడ్లల్లో ఇటీవలి కాలంలో వన్యమృగాలు- ముఖ్యంగా చిరుతల సంచారం, వాటి కదలికలు పెరగడం తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు దృష్టి సారించారు. వాటి కట్టడికి, భక్తుల భద్రతపై నిర్ణయాలు తీసుకున్నారు.

⁠అలిపిరి మెట్ల మార్గంలో భ‌క్తుల భ‌ద్ర‌త‌కు అద‌న‌పు సిబ్బంది కేటాయించాలని నిర్ణయించారు. పరిస్థితులకు అనుగుణంగా వారిని ⁠అప్ప‌టిక‌ప్పుడు అలిపిరి నడకదారి, శ్రీవారి మెట్టు, ఘాట్ రోడ్లలల్లో విధులు కేటాయిస్తారు. ఆరోగ్య‌ విభాగం ద్వారా ఎప్పటికప్పుడు చెత్త‌ను తొల‌గించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.

TTD AEO inspected the Tirumala-Alipiri Footpath route

⁠అలిపిరి మార్గాన్ని చిరుత రహిత ప్రాంతంగా మార్చడానికి కెమెరా ట్రాప్స్, స్మార్ట్ స్టిక్స్, బయో ఫెన్సింగులు, నెట్ గన్స్, హై ఫ్లాష్ టార్చ్ లైట్లు, పెప్పర్ స్ప్రేలు.. తదితర వస్తువులను రక్షణ పరికరాల వినియోగించేలా నిర్ణయం తీసుకున్నారు.⁠ ⁠నిషేధిత ఆహార పదార్థాల అమ్మకాలపై దుకాణాలపై ఆంక్షలు విధించడం, వాటి యజమానులకు అవగాహన కల్పిస్తామని వెల్లడించారు.

⁠అలిపిరి మెట్ల మార్గంలో రెండున్నర కిలో మీటర్ల పొడవు ఉన్న 7వ మైలు నుండి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయం వరకు పటిష్ట భద్రత కల్పించడం, చిరుతలు- ఇతర వన్యప్రాణుల కదలికలపై నిఘా ఉంచనున్నారు. ⁠ప్రతి నెల మానవ-వన్యప్రాణి ఘర్షణపై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి కార్యాచరణ ప్రణాళికల పురోగతిని సమీక్షిస్తారు.

తాజాగా టీటీడీ అదనపు కార్యనిర్వహణాధికారి సీహెచ్ వెంకయ్య చౌదరి.. తిరుమల- అలిపిరి కాలినడక మార్గంలో తనిఖీలు చేపట్టారు. భక్తులకు కల్పించిన భద్రత ఏర్పాట్ల గురించి క్షేత్రస్థాయిలో ఆరా తీశారు. టీటీడీ అటవీ విభాగం సిబ్బందితో మాట్లాడారు. వన్యప్రాణుల నుంచి భక్తులకు రక్షణ కల్పించడానికి కొన్ని సూచనలు చేశారు.

తిరుమల- అలిపిరి మెట్ల మార్గంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం నుండి 7వ మైలు వరకు ఉన్న అటవీ ప్రాంతాన్ని వెంకయ్య చౌదరి త‌నిఖీ చేశారు. ఈ సందర్భంగా టీటీడీ- తిరుపతి జిల్లా అటవీశాఖ అధికారులతో కలిసి కాలిబాట మార్గాన్ని పరిశీలించారు. న‌డ‌క‌దారిలో ఏర్పాటు చేసి ఉన్న స్టాటిక్ కెమెరాలు, మోషన్ సెన్సార్ కెమెరాల పనితీరును అడిగి తెలుసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+