ఏపీ పంట పండింది... మరో కొత్త రైల్వే లైను ప్రకటించిన కేంద్రం

కేంద్రంలో, రాష్ట్రంలో జాతీయ ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వాలు ఉండటంతో అభివృద్ధి వందేభారత్ రైలులా పరుగులు తీస్తోంది. ప్రధానమంత్రి మోడీ తరుచుగా చెపుతుంటారు.. కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే పార్టీ ప్రభుత్వాలుంటే అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని. ఇప్పుడు ఆ మాటను ఆయన ఏపీ విషయంలో నిజం చేసి నిరూపిస్తున్నారు. అమరావతికి కొత్త రైల్వే లైను మంజూరై పనులు జరుగుతున్నాయి. మరోవైపు నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే లైను సిద్ధమైంది. గుంటూరు నుంచి హైదరాబాద్ మార్గాన్ని డబ్లింగ్ చేస్తున్నారు. పనులు కూడా కొనసాగుతున్నాయి. భద్రాచలం - కొవ్వూరు రైల్వేమార్గం పనులు త్వరలోనే పట్టాలెక్కనున్నాయి. ఇది కాకుండా ఏపీ, తెలంగాణ, ఒడిసా, పశ్చిమబెంగాల్ లోని గిరిజన ప్రాంతాలను కలుపుతూ రూ.5వేల కోట్లకు పైగా మరో కొత్త రైల్వే లైను రాబోతోంది.

ఎంపీలపై ఆధారపడివుండటంతో..
ఇన్ని ప్రాజెక్టులు మంజూరు చేసిన తర్వాత తమ కడుపు నిండిపోతోందని ఏపీ ప్రజలు అంటున్నారు. పది సంవత్సరాల నుంచి రాష్ట్రంలో కొత్త ప్రాజెక్టులు లేక, కంపెనీలు రాక నిస్సారమైన రాష్ట్రం వృద్ధి పథంలో పరుగులు తీస్తోందంటున్నారు. 2014-19 మధ్యకాలంలో మాత్రం నామమాత్రపు ప్రాజెక్టులను కేంద్రం ఇచ్చి చేతులు దులుపుకుంది. అందుకు కారణం ఆ సమయంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుపై కోపం. ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు బలంపైనే కేంద్ర ప్రభుత్వం ఆధారపడివుండటం. అంతే తేడా. ఏదైనా అంతా రాజకీయాన్ని బట్టి అభివృద్ధి జరుగుతుందని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.

union government announcement another new railway line from narsapur to machilipatnam

గత ప్రభుత్వం డబ్బులివ్వడానికి నిరాకరించింది
తాజాగా నరసాపురం-మచిలీపట్నం రైల్వే లైను నిర్మాణ పనులకు డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ (డీపీఆర్) సిద్ధమైనట్లు కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాసవర్మ తెలిపారు. ప్రాజెక్టుకు త్వరలోనే నిధులు విడుదల చేస్తారన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి ఈ విషయం గురించి వివరించారు. నరసాపురం-కోటిపల్లి రైల్వే మార్గం ఆలస్యమవడానికి భూసేకరణ ప్రధాన అడ్డంకిగా మారిందన్నారు. గత ఐదు సంవత్సరాల్లో జగన్ ప్రభుత్వం రాష్ట్ర వాటా ఇవ్వలేదని, లేదంటే అప్పుడే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కేదన్నారు. ప్రస్తుతం నరసాపురం-మచిలీపట్నం రైల్వే లైనువల్ల కోస్తా తీరం వెంబడి రైళ్లు పరుగులు తీయబోతున్నాయన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+