'మోడీ దమ్మున్న నేత ఐతే.. దావూద్‌ను భారత్‌కు రప్పించాలి'
హైదరాబాద్: ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి హనుమంతురావు సవాల్ విసిరారు. ప్రధాని దమ్మున్న నేత అయితే అండర్ వరల్డ్ డాన్, మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు దావూద్ ఇబ్రహీంను భారత్‌కు రప్పించాలని అన్నారు.
హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ దావూద్ విషయంపై పాకిస్ధాన్ ప్రధానితో చర్చించడం కాకుండా... అతడిని భారత్‌కు రప్పించి, శిక్షించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను మోడీ నిలబెట్టుకోవాలని సూచించారు.

నల్లధనాన్ని వెనక్కి తెచ్చి ప్రజలందరికీ పంచుతానని గతంలో ఇచ్చిన హామీకి కట్టుబడి ఉండాలని అన్నారు.












Click it and Unblock the Notifications