విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గౌతమ్ రెడ్డి అనుచరుడికి పదవి: వంగవీటి రాధాకు ఇదీ జగన్ సమాధానం!

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో మరో ముసలం వచ్చేలా ఉంది. పార్టీ నుంచి సస్పెండ్ చేసిన గౌతమ్ రెడ్డి అనుచరుడికి వైసిపి పెద్దలు ఓ పదవి కట్టబెట్టిన విషయం తెలిసిందే.

|
Google Oneindia TeluguNews

Recommended Video

TOP 10 NEWS Today టుడే టాప్ 10 న్యూస్ | Oneindia Telugu

విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో మరో ముసలం వచ్చేలా ఉంది. పార్టీ నుంచి సస్పెండ్ చేసిన గౌతమ్ రెడ్డి అనుచరుడికి వైసిపి పెద్దలు ఓ పదవి కట్టబెట్టిన విషయం తెలిసిందే.

చదవండి: జగన్ నిర్ణయంపై వంగవీటి రాధా అసంతృప్తి: అసలేం జరిగింది?

దీనిపై వంగవీటి రాధాకృష్ణ తీవ్ర అసంతృప్తి, ఆగ్రహంతో ఉన్నారు. తన తండ్రిని విమర్శించిన నాయకుడి అనుచరుడికి పదవి కట్టబెట్టడంపై ఆయన గుర్రుగా ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి.

చదవండి: మా పార్టీలో వెధవలని వైసిపి నేతే అన్నారు: బాబుకు వంగవీటి రాధా దిమ్మతిరిగే కౌంటర్

జగన్‌ను అడిగిన వంగవీటి రాధా

జగన్‌ను అడిగిన వంగవీటి రాధా

ఇదే విషయాన్ని వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని వంగవీటి రాధా అడిగినట్లుగా తెలుస్తోంది. తన వర్గానికి చెందిన నాయకుడిని తొలగించి గౌతమ్ రెడ్డి అనుచరుడు నాగూర్‌కు పదవి ఎలా కట్టబెడతారని ఆయన ప్రశ్నించారట.

ఇదీ జగన్ సమాధానం

ఇదీ జగన్ సమాధానం

దీనిపై జగన్ కూడా ఆయనకు సూటిగానే సమాధానం చెప్పారని తెలుస్తోంది. నాగూర్‌కు మైనార్టీల్లో మంచి పేరు ఉందని, అందుకే ఆయనను డివిజన్ అధ్యక్షుడిగా చేశామని చెప్పారని తెలుస్తోంది.

గౌతమ్ రెడ్డికి ప్రాధాన్యత ఇవ్వడం ఏమిటి

గౌతమ్ రెడ్డికి ప్రాధాన్యత ఇవ్వడం ఏమిటి

జగన్ ప్రశ్నకు వంగవీటి రాధా మౌనం వహించడం మినహా ఏం చేయలేకపోయారని అంటున్నారు. అయితే, వంగవీటి రాధా ఇంచార్జిగా ఉన్న నియోజకవర్గంలో ఆయనకు తెలియకుండా ప్రత్యర్థి వర్గానికి చెందిన వారిని నియమించడం వంగవీటి వర్గీయులు జీర్ణించుకోలేకపోతున్నారు.

జీర్ణించుకోలేకపోతున్న రాధా వర్గీయులు

జీర్ణించుకోలేకపోతున్న రాధా వర్గీయులు

పార్టీ నుంచి తమను పొమ్మన కుండానే పొగ పెట్టేలా వ్యవహరిస్తున్నారని రాధా వర్గీయులు ఆందోళన చెందుతున్నారని తెలుస్తోంది. పార్టీ నుంచి సస్పెండ్ అయినప్పటికీ గౌతమ్ రెడ్డితో వైసిపి కీలక నేతలు సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తుండటం, సస్పెండ్ అయిన నేత వర్గాననికి ప్రాధాన్యత ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారట.

English summary
It is said that YSRCP MLA Vangaveeti Radha is disappointed with YS Jaganmohan Reddy's decision on division party president issue. He asked Jagan about appointment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X