Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జగన్ నిర్ణయంపై వంగవీటి రాధా అసంతృప్తి: అసలేం జరిగింది?

విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఓ నిర్ణయం ఆ పార్టీ ఎమ్మెల్యే అయిన వంగవీటి రాధాకృష్ణను తీవ్ర అసంతృప్తికి గురిచేసినట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే.. వంగవీటి రాధా, విజయవాడకే చెందిన మరో నేత గౌతమ్ రెడ్డిల మధ్య ఇటీవల వివాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే.

 తన తండ్రిపై అనుచిత వ్యాఖ్యలు..

తన తండ్రిపై అనుచిత వ్యాఖ్యలు..

తన తండ్రి రంగాపై గౌతంరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసిన క్రమంలో.. వీరిద్దరి మధ్య గొడకు దారితీసింది. ఈ నేపథ్యంలోనే గౌతమ్ రెడ్డిపై పార్టీ అధిష్టానం సస్పెన్షన్ వేటు కూడా వేసింది. అయినా కూడా గౌతం రెడ్డి పార్టీలోనే కొనసాగుతున్నారు.

Recommended Video

    Trending News : Top 20 Latest News Updates | Oneindia Telugu
    అవినాష్ భేటీ, జగన్ నిర్ణయంతో అసంతృప్తి

    అవినాష్ భేటీ, జగన్ నిర్ణయంతో అసంతృప్తి

    ఈ నేపథ్యంలో గౌతంరెడ్డిని కడప ఎంపీ, జగన్ బంధువు కూడా అయిన అవినాష్ రెడ్డి విజయవాడలోని ఆయన నివాసంలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా వీరిద్దరూ కలిసి దిగిన ఫొటో వైరల్‌గా మారింది. ఇది ఇలావుంటే.. గౌతంరెడ్డి అనుచరుడైన ఓ వ్యక్తికి డివిజన్ ప్రెసిడెంట్ బాధ్యతలను అప్పగిస్తూ జగన్ నిర్ణయం తీసుకోవడం వంగవీటి రాధాను అసంతృప్తికి గురిచేసింది.

     తాను సూచించిన వ్యక్తికి కాకుండా..

    తాను సూచించిన వ్యక్తికి కాకుండా..

    తాను సూచించిన మైనార్టీ నేతను కాకుండా, గౌతంరెడ్డి అనుచరుడికి బాధ్యతలను అప్పగించడంతో రాధా ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. జగన్ తాజా నిర్ణయంతో వంగవీటి రాధాను నిరాశకు గురిచేసింది.

     జగన్‌తో చర్చించినా..

    జగన్‌తో చర్చించినా..

    కాగా, ఇటీవల విజయవాడకు జగన్ వచ్చిన సందర్భంలో కూడా జగన్, రాధాల మధ్య ఇదే విషయంపై చర్చ జరిగిందని తెలుస్తోంది. ప్రస్తుత పరిణామాలు విజయవాడ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారాయి. వైయస్ జగన్ తాజా నిర్ణయంతో స్థానిక వంగావీటి వర్గం వైసీపీ నేతల్లో కూడా ఆందోళన నెలకొంది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+