నా హత్యకు కుట్ర - రెక్కీ నిర్వహించారు : వంగవీటి రాధా సంచలనం- కొడాలి నాని..వంశీ సమక్షంలో..!!
వంగవీటి రంగా తనయుడు..మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా సంచలన వ్యాఖ్యలు చేసారు. వంగవీటి రాధా వర్ధంతి సందర్భంగా ఈ రోజున అనేక ప్రాంతాల్లో కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ఉదయం టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విజయవాడలో వంగవీటి రాధాతో సమావేశమయ్యారు. రంగా విగ్రహానికి నివాళి అర్పించారు. ఆ తరువాత వంగవీటి రంగా - వల్లభనేని వంశీతో సహా గుడివాడ వెళ్లారు. అక్కడ రంగా
కు నివాళి అర్పించే సభలో రాధా కీలక వ్యాఖ్యలు చేయటం ఒక్క సారిగా అందరూ షాక్ అయ్యారు.

గుడివాడలో వంగవీటి సంచలనం
ఆ సభలో రాధా మాట్లాడుతూ... తనను పొట్టన పెట్టుకొనే ప్రయత్నం చేసారని...తాను భయడపేది లేదని చెప్పుకొచ్చారు. తాను ఎక్కడకీ పారిపోనని.. రంగా కుమారుడిగా జనంలోనే ఉంటానని స్పష్టం చేసారు. అటువంటి వారిని దూరం పెట్టాలని రాధా తన అభిమానులకు సూచించారు. తాను ఎవరికీ భయపడి పారి పోయేది లేదని తేల్చి చెప్పారు. తనకు పదవుల పైన ఆశ లేదని..రంగా ఆశయాలు..లక్ష్య సాధన కోసమే పని చేస్తానని స్పష్టం చేసారు. ఆ తరువాత మీడియాతో మాట్లాడుతూ...తన మీద రెక్కీ జరిగిందని చెప్పుకొచ్చారు.

హత్యకు కుట్ర - రెక్కీ చేసారంటూ
త్వరలోనే వారెవరనేది తెలుస్తుందన్నారు. కానీ, వారెవరనేది మాత్రం రాధా క్లారిటీ ఇవ్వలేదు. ఇక, ఇది ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మంత్రి కొడాలి నాని.. రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని సమక్షంలోనే రాధా ఈ తరహా వ్యాఖ్యలు చేసారు. రాధా గతంలో కాంగ్రెస్.. ప్రజారాజ్యం.. వైసీపీ..ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు. కానీ, పార్టీ పరంగా క్రియాశీలకంగా లేరు. రాధా తిరిగి వైసీపీలోకి వస్తారనే ప్రచారం కొంత కాలంగా సాగుతోంది. అదే విధంగా టీడీపీలో చేరే సమయంలో రాధాకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామనే హామీ ఇచ్చినట్లుగా చెబుతారు.

కొడాలి నాని - వంశీ సమక్షంలో
కానీ, అది అమలు కాలేదు. ఇక, ఇప్పుడు సాధ్యపడే అంశం కాదు. వైసీపీతో విభేదించి బయటకు వెళ్లిన రాధాకు ఇప్పుడు మంత్రిగా ఉన్న కొడాలి నాని... టీడీపీ నుంచి వైసీపీకి దగ్గరైన వల్లభనేని వంశీ మిత్రులు. వీరిద్దరూ రాధాను తిరిగి వైసీపీకి దగ్గర చేసే ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం బెజవాడ పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. కానీ, రాధా మాత్రం తిరిగి వైసీపీలో చేరే అంశం పైన క్లారిటీ ఇవ్వలేదని తెలుస్తోంది. ఇప్పుడు రాధా చేసిన వ్యాఖ్యలు...తనను పొట్టన పెట్టుకొనే ప్రయత్నాలు చేస్తున్న వారిని దూరంగా ఉంచండి అని వ్యాఖ్యానించటం ద్వారా ...ఏం జరుగుతందనే చర్చ మొదలైంది.












Click it and Unblock the Notifications