దువ్వాడ సతీమణి తాజా డిమాండ్స్ - సెటిల్మెంట్ లో కొత్త ట్విస్ట్..!!
వైసీపీ నేత దువ్వాడ ఫ్యామిలీ రచ్చ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఈ వివాదానికి ముగింపు పలికేందుకు కుటుంబ పెద్దలు రంగంలోకి దిగాయి. రెండు వైపులా చర్చలు ప్రారంభించారు. వివాదానికి ముగింపు పలికేలా ఇద్దరికి ఆమోదయోగ్యంగా ప్రతిపాదనలు చేసారు. అందులో భాగంగా వాణి తన భర్త ముందు అయిదు డిమాండ్లు పెట్టారు. అందులో మూడింటికి శ్రీనివాస్ ఓకే చెప్పారు. ఆ రెండు డిమాండ్ల పైనే ప్రస్తుతం పంచాయితీ వేళ కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది.
సెటిల్మెంట్
దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం కొత్త మలుపు తీసుకుంది. వివాదం ముగించేందుకు కుటుంబ పెద్దలు జోక్యం చేసుకున్నారు. దువ్వాడ సతీమణికి ఏం కావాలని కోరారు. ఆస్తి పంపకాల అంశం పైనే ప్రధానంగా ఈ డిమాండ్లు ఉన్నట్లు తెలుస్తోంది. తన సతీమణి డిమాండ్లలో భాగంగా పర్లాకిమిడి లోని ఫ్యాక్టరీ, టెక్కలి వెంకటేశ్వర కాలనీలోని నివాసాన్ని పిల్లలకు రిజిస్టర్ చేసేందుకు ఎమ్మెల్సీ శ్రీనివాస్ అంగీకరించారు. వీటితో పాటుగా చిన్న కుమార్తె పీజీ మెడికల్ ఎడ్యుకేషన్, వివాహం ఖర్చు భరించేందుకు అభ్యంతరం లేదని చెప్పారు.

తాజా డిమాండ్లు
నాలుగో డిమాండ్ గా ప్రస్తుతం శ్రీనివాస్ ఉంటున్న ఇంటికి పిల్లల పేరుతో రిజిస్టర్ చేయాలని ఆయన సతీమణి డిమాండ్ చేస్తున్నారు. అందుకు శ్రీనివాస్ అంగీకరించటం లేదు. విడాకులు ఇవ్వాలనే అంశం పైన నిర్ణయం కొలిక్కి రాలేదని తెలుస్తోంది. ఇంత రచ్చ జరిగిన తరువాత ఇద్దరూ వేర్వేరుగా ఉండటమే మంచిదని పెద్దలు సైతం సూచించినట్లు చెబుతున్నారు. ఇక, తన ఇంట్లోకి ఎంట్రీకి మాత్రం శ్రీనివాస్ అంగీకరించటం లేదని సమాచారం. తామ గతంలో చెప్పినవే ఇప్పుడు చెబుతున్నారనేది వాణి వాదన.
రాజీ కుదిరేనా
రూ 40 లక్షల జీఎస్టీతో పాటుగా రూ 33 లక్షల రుణం కట్టాలని శ్రీనివాస్ సతీమణి డిమాండ్ చేస్తున్నారు. అదే విధంగా తాకట్టు లో ఉన్న బంగారం విడిపించాలని కోరుతున్నారు. వీటికి అంగీకరిస్తే అటునుంచి వచ్చిన అంశాల పైన తాము సానుకూలంగా స్పందిస్తామని తేల్చి చెబుతున్నారు. దీంతో, రెండు వైపులా విషయాన్ని సెటిల్ చేయాలని రంగంలోకి దిగిన పెద్దలకు ఇద్దరి పంతం సమస్యగా మారుతోంది. ఈ రోజు లేదా రేపు ఈ వివాదం కొలిక్కి వస్తుందని భావిస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో చర్చగా మారిన ఈ రచ్చకు ఎలాంటి ముగింపు వస్తుందనేది చూడాల్సి ఉంది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications