వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబు అండ్ బ్యాచ్ చేసిన పనికి సమన్లు ఇవ్వకుంటే చప్పట్లు కొడతామా? వాసిరెడ్డి పద్మ ఫైర్

|
Google Oneindia TeluguNews

విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మానసిక వికలాంగురాలిపై జరిగిన అత్యాచార ఘటన అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధానికి తెరతీసింది. ఇక తాజాగా రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ, టిడిపి నేత బోండా ఉమ, చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. విచారణకు హాజరు కాకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని, కచ్చితంగా కమీషన్ ముందు హాజరు కావాలని వెల్లడించారు.

 చంద్రబాబు, బోండా ఉమలకు మహిళా కమీషన్ సమన్లు

చంద్రబాబు, బోండా ఉమలకు మహిళా కమీషన్ సమన్లు

అత్యాచార బాధితురాలిని పరామర్శించడానికి వెళ్ళిన మహిళా కమిషన్ చైర్ పర్సన్ పై టీడీపీ శ్రేణులు దౌర్జన్యానికి దిగడాన్ని, మహిళా కమిషన్ సీరియస్ గా తీసుకుందని పేర్కొన్న వాసిరెడ్డి పద్మ ఈనెల 27వ తేదీ ఉదయం 11 గంటలకు మంగళగిరిలోని రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని చంద్రబాబు, బోండా ఉమకు సమన్లు జారీ చేశామని వెల్లడించారు.

బోండా ఉమా లాంటి వాళ్లకు మహిళా కమీషన్ సుప్రీమే

బోండా ఉమా లాంటి వాళ్లకు మహిళా కమీషన్ సుప్రీమే


మహిళా కమిషన్ సమన్లు జారీ చేసిన తర్వాత బోండా ఉమ చేస్తున్న అనేక ఆరోపణలపై శనివారం మీడియాతో మాట్లాడిన వాసిరెడ్డి పద్మ బోండా ఉమ వ్యాఖ్యలపై ఎదురు దాడి చేశారు. బోండా ఉమ మహిళా కమిషన్ పై ఆరోపణలు చేస్తున్నాడు.. మహిళా కమిషన్ సుప్రీమా అని ప్రశ్నిస్తున్నాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన వాసిరెడ్డి పద్మ నీ లాంటి వాళ్లకు మహిళా కమిషన్ సుప్రీమే అంటూ సమాధానమిచ్చారు. ఇలాంటి నేరాలు ఎవరు చేసినా క్షమించేది లేదని వాసిరెడ్డి పద్మ తేల్చిచెప్పారు.

బోండా ఉమా ఆకు రౌడీ.. వాసిరెడ్డి పద్మ ధ్వజం

బోండా ఉమా ఆకు రౌడీ.. వాసిరెడ్డి పద్మ ధ్వజం


బోండా ఉమా ఆకు రౌడీ అంటూ వాసిరెడ్డి పద్మ విమర్శలు గుప్పించారు. మహిళా కమిషన్ కన్నీరు పెట్టుకోవడానికి లేదని కన్నీళ్లు తుడవడానికి ఉందని పేర్కొన్న వాసిరెడ్డి పద్మ చంద్రబాబు హయాంలో మహిళా కమిషన్ తూతూమంత్రంగా ఉందని విమర్శలు గుప్పించారు. తాను మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా బాధితురాలికి ధైర్యం ఇవ్వడానికి వచ్చానని పేర్కొన్న ఆమె, చంద్రబాబు అండ్ బ్యాచ్ చేసిన పనికి సమన్లు ఇవ్వకుంటే చప్పట్లు కొడతామా అంటూ ప్రశ్నించారు.

బాధితురాలితో ఎలా వ్యవహరించాలో కూడా చంద్రబాబుకు తెలీదు

బాధితురాలితో ఎలా వ్యవహరించాలో కూడా చంద్రబాబుకు తెలీదు


చంద్రబాబు, బోండా ఉమ నోటీసులు తీసుకుని మహిళా కమిషన్ కు సమాధానం చెప్పాలని వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. బాధితురాలితో ఎలా వ్యవహరించాలో చంద్రబాబుకు కనీసం తెలియదని వాసిరెడ్డి పద్మ అసహనం వ్యక్తం చేశారు. యుద్ధానికి వెళుతున్నట్టు పెద్ద సంఖ్యలో మందీ మార్బలంతో వచ్చి న్యూసెన్స్ చేశారని మండిపడ్డారు. ఏ రాష్ట్రంలో నైనా ఈ తరహా పరామర్శలు ఉన్నాయా అని ప్రశ్నించారు. అత్యాచార బాధితురాలితో ఏవిధంగా మాట్లాడాలో కూడా తెలియదా అంటూ మండిపడ్డారు.

రాజకీయం తప్ప టీడీపీ నేతలలో సానుభూతి లేదు

రాజకీయం తప్ప టీడీపీ నేతలలో సానుభూతి లేదు


27వ తేదీన చంద్రబాబు, బోండా ఉమ కమిషన్ ముందు హాజరు కావాల్సిందేనంటూ తేల్చి చెప్పారు వాసిరెడ్డి పద్మ. బాధితురాలి దగ్గర బలప్రదర్శన చేయడం ఏంటి? నా మీద సవాల్ చేయడం ఏంటి? అని ప్రశ్నించిన వాసిరెడ్డి పద్మ ప్రతీ ఘటనను రాజకీయం చేయడం తప్ప వారిలో సానుభూతి లేదని విమర్శించారు. మహిళలకు ఇబ్బంది కలిగితే సమన్లు ఇచ్చే అధికారం మహిళా కమిషన్ కు ఉందని, గతంలోనూ అనేక మంది పోలీసు అధికారులకు కూడా సమన్లు ఇచ్చామని వాసిరెడ్డి పద్మ వెల్లడించారు.

English summary
AP Women commission chair person Vasireddy Padma slams bonda uma on his comments and said that Chandrababu and Bonda Uma should appear before the commission.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X