వైఎస్ జగన్ తాడేపల్లి ఇంట్లో వాస్తు మార్పులు.. కారణం ఇదేనా!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో ప్రచ్చన్న యుద్ధం హోరాహోరీగా సాగుతుంది. అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రజాక్షేత్రంలోకి వెళుతూ ఒకరిపై ఒకరు సంచలన ఆరోపణలు చేసుకుంటూ రాజకీయాలను రసవత్తరంగా మారుస్తున్నారు. ముఖ్యంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మళ్లీ అధికారంలోకి రావాలని శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. వైనాట్ 200 అంటూ ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తున్న జగన్ ఇంత బిజీ షెడ్యూల్ లోను తాడేపల్లిలోని ఆయన నివాసంలో వాస్తుమార్పులపై దృష్టి పెట్టారు.

జగన్ నివాసంలో వాస్తు మార్పులు
తాడేపల్లిలోని జగన్ నివాసంలో వాస్తు మార్పులు జరుగుతున్న కారణంగా ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా దీనిపై ఆసక్తికర చర్చ జరుగుతుంది. జగన్ ఈ సమయంలో వాస్తు మార్పులు ఎందుకు చేస్తున్నారు? జగన్ ఇంటి వాస్తు దోషం ఆయనకు ఎన్నికలలో ఎఫెక్ట్ చేస్తుందా? లేదంటే ఇంత హడావుడిగా వాస్తు మార్పులు చేయాల్సిన అవసరం ఏంటి? అన్నది ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.

Vastu changes in YS Jagan Tadepalli house is this the reason

జగన్ ఇంటి ప్రహరీలో వాస్తు మార్పులు
రాష్ట్రవ్యాప్తంగా వైసిపి అనుకూల వాతావరణం కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్న జగన్ ఏ చిన్నఅంశాన్ని కూడా వదిలిపెట్టకుండా జాగ్రత్త పడుతున్నారు. అభ్యర్థుల ఎంపిక నుండి, ఎన్నికల ప్రచారం మాత్రమే కాకుండా, ఇంటి వాస్తులోపాలపైన కూడా దృష్టిపెట్టి సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. జగన్ ఇంటి వాస్తుమార్పులలో భాగంగా వాస్తు పండితులను పిలిపించగా వారు జగన్ ఇంటి చుట్టూ ఎత్తుగా నిర్మించిన ఇనుపకట్టడాన్ని ఒక మూల తొలగించాలని జగన్ కు సూచించినట్లు సమాచారం.

ఇంట్లో ఎవరూ కనిపించకుండా ఎత్తైన ఇనుప కట్టడం నిర్మించిన జగన్
ఇక ఆ పనిని బుధవారం నుంచి ముమ్మరంగా చేస్తున్నట్టు సీఎం క్యాంప్ కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి. తాడేపల్లి లో సీఎం క్యాంపు కార్యాలయ భవనాలు పక్కపక్కనే ఉంటాయి. ఇక వాటికి సమీపంలోని ప్రైవేట్ వ్యక్తులకు చెందిన విల్లాలు, అపార్ట్మెంట్లు ఉన్నాయి. అయితే ఈ విల్లాలు, అపార్ట్మెంట్లలో నుంచి చూస్తే స్పష్టంగా కనిపిస్తారన్న ఉద్దేశంతో చాలా కాలం క్రితం బలమైన ఎత్తైన ఇనుప కట్టడాన్ని నిర్మించారు.

జగన్ అదృష్టానికి అడ్డంకిగా మారిన ఇనుప కంచె?
లోపల ఏమీ కనపడకుండా చీమ కూడా చొరబడకుండా దానిని చాలా బందోబస్తుగా నిర్మించారు. అయితే ఇప్పుడు ఇంటి చుట్టూ చాలా ఎత్తుగా నిర్మించిన ఇనుప కంచె సీఎం జగన్ అదృష్టానికి అడ్డంకిగా మారుతుంది అని వాస్తు నిపుణులు చెప్పిన సలహా మేరకు ఇనుప ప్రహరీని ఒక వైపున తొలగిస్తున్నారు.

వైసీపీ శ్రేణుల్లో ఆసక్తికర చర్చ
బుధవారం రాత్రి నుంచి వెల్డర్లు, కార్మికులు ఆ పని చేస్తున్నారు. దాన్ని సీఎం స్వయంగా పర్యవేక్షిస్తున్నట్టు కూడా సమాచారం. ఇంత బిజీ షెడ్యూల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ ఇనుప కంచెను తొలగించాల్సిన అవసరం ఏమిటి? దీని వెనుక ఉన్న మతలబు ఏమిటి? అన్నది ముఖ్యంగా రాజకీయ వర్గాల్లో, ముఖ్యంగా వైసీపీ శ్రేణుల్లో ఆసక్తికర చర్చకు కారణంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+