వెలిగొండ ప్రాజెక్ట్ పై చంద్రబాబు డబ్బాకొట్టడం ఈ శతాబ్దపు అతిపెద్ద జోక్ : వైఎస్ షర్మిల!
వెలిగొండ ప్రాజెక్ట్ ను నేడు ఏపీ సీఎం చంద్రబాబు ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అయితే వెలిగొండ ప్రాజెక్ట్ పై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆసక్తికర విషయాలను వెల్లడించారు. 3దశాబ్దాలకు వెలిగొండ మొదటి దశ శుభసూచకమే అని పేర్కొన్న షర్మిల తీవ్ర కరువురక్కసి కోరల్లో చిక్కుకున్న ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలకు ఇకనైనా సాగు, త్రాగు నీరు మరింత మెరుగ్గా అందుతాయని ఆశిద్దాం అంటూ వ్యాఖ్యలు చేశారు.
వెలిగొండపై చంద్రబాబు గారివి కొండంత అబద్ధాలు : వైఎస్ షర్మిల
ఇదే సమయంలో సీఎం చంద్రబాబును టార్గెట్ చేశారు. వెలిగొండపై చంద్రబాబు గారివి కొండంత అబద్ధాలు అన్న షర్మిల, కట్టిన కష్టం YSR ది.. రాజకీయ ప్రచారం చంద్రబాబు గారిది అంటూ ఎద్దేవా చేశారు. వెలిగొండ ప్రాజెక్ట్ తన విజన్ అని చెప్పుకోవడం ఈ శతాబ్దపు అతిపెద్ద జోక్ అని షర్మిల సెటైర్లు వేశారు. సంకల్పం పేరుతో ఆనాడు 1996 మార్చి 5న, బాబు వేసింది కేవలం ఓ రాయి మాత్రమేనన్నారు.

10 శాతం పనులు చేసి క్రెడిట్ తమదేనని చెప్పుకోవడానికి సిగ్గు పాడాలన్న షర్మిల
తానే శంకుస్థాపన చేసి, తానే పూర్తి చేశానని గొప్పలు చెప్పుకొనే ముందు చంద్రబాబు గారు ఆత్మ పరిశీలన చేసుకోవాలని వైఎస్ షర్మిల హితవు పలికారు. వెలిగొండ ప్రాజెక్ట్ కష్టం, చెమట దివంగత ముఖ్యమంత్రి YSR ది అయితే, 10 శాతం పనులు చేసి క్రెడిట్ తమదేనని చెప్పుకోవడానికి సిగ్గుపడాలన్నారు. 4 న్నర లక్షల ఎకరాలకు సాగునీరు, 23 లక్షల మంది ప్రజలకు త్రాగునీరు నేడు అందుతుందంటే.. అది వైఎస్సార్ జలయజ్ఞ ఫలితమే అన్నారు.
వెలిగొండకు నిజంగా YSR వెలుగైతే.. చంద్రబాబు చీకటి
వెలిగొండకు నిజంగా YSR వెలుగైతే.. చంద్రబాబు చీకటి అంటూ షర్మిల టార్గెట్ చేశారు.చంద్రబాబు నిజాయితీ పరులే అయితే, మీ ఛాతిలో ఉన్నది నిజంగా గుండేనే అయితే.. శంకుస్థాపన చేసినసంకల్పం మీదే అవ్వచ్చు.. కానీ సాకారం చేసింది మాత్రం కాంగ్రెస్ ముఖ్యమంత్రి YSR అని ఒప్పుకోవాలన్నారు. అనుమతులు, నిధులు ఇవ్వకుండా, అడ్వైజరీ కమిటీల పేరుతో, DPR ల ముసుగులో 9ఏళ్ల కాలయాపన చేశారని, శిలాఫలకం తప్పా తట్టెడు మట్టి ఎత్తింది లేదన్నారు.
వెలిగొండ ప్రాజెక్టును 82శాతం పూర్తి
రాయి నుంచి కరువు సీమకు జలవసంతం వెనుక YSRదే భగీరథ ప్రయత్నం అన్నారు. 2004లో అధికారంలో వచ్చిన వెంటనే మహానేత మొదలుపెట్టిన బృహత్తర సంకల్పం ఇదేనన్నారు. చిన్న ప్రాజెక్టుగా ఉన్న వెలిగొండను భారీ ప్రాజెక్టుగా ..రీ డిజైన్ చేసిన మహనీయుడు వైఎస్సార్ అన్నారు. వెలిగొండ ప్రాజెక్టును 82శాతం పూర్తి చేసింది YSR అన్నారు. ట్విన్ టన్నెల్స్, నల్లమల సాగర్, మూడు ప్రధాన డ్యాములతో భారీ ప్రాజెక్టుగా తీర్చిదిద్దింది YSR అన్నారు
గొట్టిపాడు, సుంకేసుల డ్యాముల నిర్మాణం కోసం భూసేకరణ పూర్తి చేసి పరిహారం
22 km మేర సొరంగాల నిర్మాణం పూర్తి అయ్యింది నాడు YSR పాలనలోనే అని గుర్తు చేశారు YSR హయాంలో జలయజ్ఞం కింద వెలిగొండ కి 4 వేల కోట్ల రూపాయల ఖర్చు చేసి సింహభాగం పనులు పూర్తి చేశారన్నారు. గొట్టిపాడు, సుంకేసుల డ్యాముల నిర్మాణం కోసం భూసేకరణ పూర్తి చేసి పరిహారం అందించి, పనులు పూర్తి చేసింది YSR అని పేర్కొన్నారు. ఇక రెండో దశ పనులు, నిజాయితీ, నిబద్ధతతో పూర్తిస్థాయి పునరావాసంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని అని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.














Click it and Unblock the Notifications