మహిళా కమిషన్ లో హైడ్రామా-చంద్రబాబు, బోండా డుమ్మా- వద్మ వర్సెస్ అనిత వాగ్వాదం

విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో గ్యాంగ్ రేప్ కు గురైన బాధితురాలిని పరామర్శించే క్రమంలో తలెత్తిన వాగ్వాదం నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమకు మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది. అయితే ఇవాళ విచారణకు వీరిద్దరూ గైర్హాజరయ్యారు. అదే సమయంలో మహిళా కమిషన్ కు వెళ్లిన టీడీపీ మహిళా నేత వంగలపూడి అనితకూ, కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.

చంద్రబాబు, బోండా డుమ్మా


విజయవాడ ప్రభుత్వాసుపత్రి ఘటనపై మహిళా కమిషన్ జారీ చేసిన నోటీసుల ప్రకారం ఇవాళ విచారణకు హాజరు కావాల్సిన చంద్రబాబు, బోండా ఉమ డుమ్మా కొట్టారు. ముందునుంచే వారు ఈ విచారణకు హాజరు కాబోమని చెప్తూ వచ్చారు. దీనిపై స్పందించిన మహిళా కమిషన్ విచారణకు హాజరు కావాల్సిందేనని హెచ్చరికలు కూడా పంపింది. అయినా వారిద్దరూ పట్టించుకోలేదు. దీంతో మహిళా కమిషన్ సమన్లను వారు లెక్కచేయలేదని తేలిపోయింది.

వాసిరెడ్డి వద్మ వర్సెస్ వంగలపూడి అనిత

మహిళా కమిషన్ విచారణకు హాజరు కావాల్సిన చంద్రబాబు, బోండా ఉమ గైర్హాజరు కాగా.. అదే సమయంలో తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆధ్వర్యంలో ఆ పార్టీ మహిళా కార్యకర్తలు వెళ్లారు. గంటకు పైగా పోలీసులతో వాగ్వాదం తర్వాత వారిని మహిళా కమిషన్ లోకి అనుమతించారు. ఆ తర్వాత విజయవాడ గ్యాంగ్ రేప్ బాధితురాలి తల్లితో కలిసి లోపలికి వెళ్లిన వంగలపూడి అనిత.. జగన్ హయాంలో రాష్ట్రంలో జరిగిన అత్యాచారాలపై ఓ పుస్తకాన్ని వాసిరెడ్డి వద్మకు అందజేశారు. దీనిపై కాసేపు వాగ్వాదం తర్వాత ఆ పుస్తకాన్ని తీసుకున్న పద్మ.. పరిశీలించి స్పందిస్తానని హామీ ఇచ్చారు.

చర్యలు తప్పవన్న వాసిరెడ్డి వద్మ

చర్యలు తప్పవన్న వాసిరెడ్డి వద్మ

మహిళా కమిషన్ విచారణకు గైర్హాజరైన చంద్రబాబు, బోండా ఉమపై ఛైర్ పర్సన్ వాసిరెడ్డి వద్మ మండిపడ్డారు. చంద్రబాబు, బోండా ఆస్పత్రిలో చేసిన తప్పిదాలను వరుసగా చదివి వినిపించారు. అంతేకాకుండా తమ విచారణకు హాజరు కాని వీరిద్దరిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. మహిళా కమిషన్ అంటే చంద్రబాబుకు గౌరవం లేదని, మహిళలంటే కూడా గౌరవం లేదని పద్మ ఆరోపించారు. పురుషాహంకారంతోనే వీరిద్దరూ తమ నోటీసుల్ని లెక్క చేయలేదన్నారు. తాము విచారణకు పిలిస్తే దానికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలు ఆందోళనకు పిలుపునివ్వడాన్ని కూడా వాసిరెడ్డి వద్మ తప్పుబట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+