పార్టీ ఫిరాయింపులపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు...ఆత్మీయ సమావేశంలో ఏం చెప్పారంటే
విజయవాడలో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పార్టీ ఫిరాయింపులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో ఏపీలో 23 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు . ఉప రాష్ట్రపతి గా వెంకయ్య నాయుడు రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న వెంకయ్య రెండేళ్ళ కాలంలో తానేమి చేశానో చెప్పారు. నా ఎదుగుదలకు బిజెపి, స్నేహితులే కారణమని చెప్పిన ఆయన ఉపరాష్ట్రపతి పదవితో ప్రజల దగ్గరకు చేరువవుతున్నానని చెప్పారు.

5 రంగాలపై దృష్టి పెట్టి కృషి చేస్తున్నానని చెప్పిన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
ఉపరాష్ట్రపతి పదవికి సెలవు లేదు...ఎక్కడికి వెళ్ళడానికి లేదన్న వెంకయ్య తాను 5 రంగాలపై దృష్టి పెట్టి కృషి చేస్తున్నానని చెప్పారు. యువత కోసం 9 వందల యూనివర్సిటీ లు ఉన్నాయన్న ఆయన,తాను రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నానని చెప్పారు. రైతు కుటుంబం నుండి వచ్చానని గర్వంగా చెప్పుకున్నారు. ఇక 64 కళల గొప్పతనం చెప్పి వారిని కలుస్తున్నానని పేర్కొన్నారు. సమాజ సేవకులను ప్రోత్సహిస్తున్నానని పేర్కొన్నారు. డాక్టర్స్, అధ్యాపకులు, లాయర్స్, ఇతర ఉద్యోగ సంఘాల సమస్యల పరిష్కారానికి పని చేస్తున్నానని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా పర్యటించి దౌత్య సంబంధాలు బలోపేతం చేస్తున్నానన్న ఆయన 22 దేశాలు తిరిగానని పేర్కొన్నారు.

రాజకీయ పార్టీలు ప్రవర్తన నియమావళి రూపొందించుకోవాలని చెప్పిన వెంకయ్య నాయుడు
గతంలో ప్రపంచం లో అందరూ అమెరికా, చైనా ల వైపు చూసేవారు ప్రస్తుతంభారత్ వైపు చూస్తున్నారని గర్వంగా చెప్పారు .దేశం ఆర్థికం గా ఎదుగుతుండటం తో గుర్తింపు వచ్చిందన్న వెంకయ్య ఉపరాష్ట్రపతి పదవి నాలుగు గోడలకు పరిమితం కాకూడదనే విజ్ఞాన యాత్ర పేరిట జనం దగ్గరకుచేరువ అవుతున్నానన్నారు. ఇక ప్రజాస్వామ్యం ఫరిడవిల్లాలంటేవిలువలుండాలన్న ఆయన ప్రవర్తన నియమావళి రాజకీయ పార్టీలు రూపొందించుకోవాలన్నారు. కులమతాలకు అతీతంగా ఓటు వెయ్యాలని చెప్పారు. ఎపి లో23 మంది ఎమ్మెల్యేల ఫిరాయింపు , స్పీకర్ నిర్ణయం లేకపోవడం పై ప్రస్తావించారు వెంకయ్య నాయుడు.

రాజ్యాంగంలో టెన్త్ షెడ్యూల్‌లో స్పష్టత లేకనే ఫిరాయింపులు అన్న వెంకయ్య నాయుడు
పార్టీ ఫిరాయింపులకు సంబంధించి రాజ్యాంగంలో టెన్త్ షెడ్యూల్‌లో స్పష్టత లేదని ఆయన అభిప్రాయపడ్డారు. దీనిపై చర్చ జరగాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ తగిన సమయంలో నిర్ణయం తీసుకోకపోతే ఏం చేయాలనే అంశంపై రాజ్యాంగంలో స్పష్టత లేదని వెంకయ్యనాయుడు అన్నారు.దీని వల్లే రాజకీయ సంక్షోభం ఏర్పడుతుంది అన్నారు. న్యాయస్థానాల్లోనూ దీనికి సంబంధించిన కేసుల విచారణ నిర్ణీత గడువులో జరగడం లేదని వెంకయ్య పేర్కొన్నారు. తమిళనాడులో కేంద్ర మాజీమంత్రి చిదంబరం 2009లో ఎన్నికవడంపై కొనసాగుతున్న కేసు ను వెంకయ్యనాయుడు గుర్తు చేశారు . అంతే కాదు కొద్దిరోజుల క్రితం ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం , పార్టీ మారిన టీడీపీ ఎంపీల విషయంలో రాజ్యసభ చైర్మన్‌గా ఉన్న వెంకయ్యనాయుడు ఇలా ఫిరాయింపుల తీరు సరికాదని వ్యాఖ్యానించారు .
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications