బాబుపై విరుచుకుపడి బిజెపికి విజయసాయి వత్తాసు: జగన్ కీలక భేటీ

Posted By:
Subscribe to Oneindia Telugu
  YSRCP MP Drama's For Mull With BJP

  తిరుపతి/ నెల్లూరు : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై విరుచుకుపడిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు విజయసాయి రెడ్డి బిజెపికి వత్తాసు పలికినట్లు కనిపిస్తున్నారు. మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యానికి ఆయన మాటలు అద్దం పడుతున్నాయని అంటున్నారు.

  తన వైఫల్యాలను చంద్రబాబు కేంద్రంలోని ఎన్డీఎ సర్కారుపై రుద్దుతున్నారని విజయ సాయి రెడ్డి వ్యాఖ్యానిింాచరు. ఎపికి అన్యాయం జరుగుతున్నా కూడా నాలుగేళ్ల పాటు మౌనంగా ఉన్నది చంద్రబాబు కాదా అని ఆయన అడిగారు.

  రాజకీయ ప్రయోజనం కోసమే టిడిపి

  రాజకీయ ప్రయోజనం కోసమే టిడిపి

  రాజకీయ ప్రయోజనం కోసమే తెలుగుదేశం పార్టీ ఎంపీలు పార్లమెంటులో గొడవ చేశారని విజయసాయి రెడ్డి అన్నారు. ఎపికి ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు ఎందుకు మాట్లాడడం లేదని ఆయన ప్రశ్నించారు. చిత్తూరు జిల్లా తిరుపతిలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు.

  మేం పోరాటం చేస్తున్నాం

  మేం పోరాటం చేస్తున్నాం

  ఎపి ప్రయోజనాల కోసం తమ పార్టీనేతలు పోరాటం చేస్తూనే ఉన్నారని, కానీ అధికార టిడిపి నేతలు రాజకీయ ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారని విజయ సాయి రెడ్డి అన్నారు. కేవలం పార్టీ ప్రయోజనాల కోసం పార్లమెంటులో తాు కూడా పోరాడినట్లు టిడిపి ఎంపీలు వ్యవహరిస్తున్నారని అన్నారు.

  అందుకే అందరినీ కలుస్తున్నాం

  అందుకే అందరినీ కలుస్తున్నాం

  ఓ ఎంపీగా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే క్రమంలో భాగంగానే తాము అందరినీ కలుస్తున్నామని, సిఎం చంద్రబాబు ప్రోత్సహిస్తున్న ఫిరాయింపులకు వ్యతిరేకంగా ఈసిని కలుస్తామని విజయ సాయిరెడ్డి చెప్పారు.

  పార్టీ నేతలతో జగన్ కీలక భేటీ

  పార్టీ నేతలతో జగన్ కీలక భేటీ

  పార్టీ ముఖ్యనేతలతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశం నెల్లూరు జిల్లా కనిగిరి మండలం పెద్దకొండూరులో జరుగుతుంది. పార్టీ పార్లమెంటు సభ్యులు, ప్రాంతీయ సమన్వయకర్తలు ఈ సమావేశంలో పాల్గొంటారు. రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలపై, కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన కేటాయింపులూ అన్యాయంపై ఈ సమావేశంలో చర్చిస్తారు.

  హోదాపై సమావేశంలో చర్చ

  హోదాపై సమావేశంలో చర్చ

  కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఏమీ చేయకపోయినా ఏదో సాధించినట్లు టిడిపి నేతలు చేస్తున్న హడావిడిపై, వారి సంబరాలపై ఈ సమావేశంలో చర్చిస్తారని పార్టీ నాయకులు చెబుతున్నారు. ప్రత్యేక హోదానే రాష్ట్రానికి సంజీవిని అంటూ గత నాలుగేళ్లుగా తాము చేస్తున్న పోరాటాన్ని మరింత ముందుకు తీసుుని వెళ్లేందుకు అవసరమైన కార్యాచరణపై కూడా ఈ సమావేశంలో చర్చిస్తారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  YSR Congress Rajya Sabha MP Vijay sai Reddy has blamed Andhra Pradesh CM and Telugu Desam Party chief Nara Chandrababu Naidu.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి