Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ కు చంద్రం ప్రేరణ అంట..ఏదైనా మతి భ్రమించిన చంద్రబాబుకే సాధ్యం: విజయసాయి వ్యంగ్యం

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోమారు టిడిపి అధినేత చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు చేసి చెప్పే మాటలు, చేసే వ్యాఖ్యలు నమ్మశక్యం కాని విధంగా ఉంటాయని ఆయన తనదైన శైలిలో సెటైర్లు వేశారు. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేసిన సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు చంద్రం ప్రేరణ అంట. చంద్రబాబును చూసే కేంద్రం ఐడియాని కాపీ కొట్టిందట అంటూ విజయ సాయి రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

జనం పగలబడి నవ్వుతారన్న ఇంగితం లేకుండా ఈ కామెడీ ఏంటి బాబూ ?

జనం పగలబడి నవ్వుతారన్న ఇంగితం లేకుండా ఈ కామెడీ ఏంటి బాబూ ?

తాజాగా ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసిన విజయసాయిరెడ్డి ఢిల్లీలో ప్రధాని శంకుస్థాపన చేసిన సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు చంద్రం ప్రేరణ అంట. అమరావతి అనే భ్రమరావతి మహానగరంలో ఆఫీసులో అన్నీ ఒకే చోట ఉండటం చూసి కేంద్ర ఆయన ఐడియాను కాపీ కొట్టింది అంటా .. అంటూ పేర్కొన్న విజయసాయిరెడ్డి జనం పగలబడి నవ్వుతారు అన్న ఇంగితం కూడా లేకుండా ఈ కామెడీ ఏంటి బాబు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇదే సమయంలో మరో పోస్ట్ లో ఏపీలో పోలీసును వైసిపి నేత కొట్టాడు అంటూ టిడిపి నేతలు చేస్తున్న విమర్శలకు సమాధానం చెప్పారు.

బురద చెల్లేస్తే వాళ్ళే తుడుచుకోలేక చస్తారు అనే శాడిస్టిక్ మెంటాలిటీ చంద్రబాబుది

బురద చెల్లేస్తే వాళ్ళే తుడుచుకోలేక చస్తారు అనే శాడిస్టిక్ మెంటాలిటీ చంద్రబాబుది

వైజాగ్ లో ప్రమాదవశాత్తు కింద పడ్డ పోలీస్ అధికారిని లేపి సాయపడుతున్న యువకుడిని అతని పై దాడి చేస్తున్న గుండగా అభివర్ణించి రచ్చ చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇలా ప్రతి విషయంలోనూ రచ్చ చేయడం మతిభ్రమించిన చంద్రబాబుకే సాధ్యమవుతుందని పేర్కొన్నారు విజయసాయిరెడ్డి. అంతేకాదు బురద చెల్లేస్తే వాళ్ళే తుడుచుకోలేక చస్తారు అనే శాడిస్టిక్ మెంటాలిటీ చంద్రబాబుది అంటూ మండిపడ్డారు.విజయసాయి సోషల్ మీడియా వ్యాఖ్యలపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. అయినా ఆయన మాత్రం తన పంధా కొనసాగిస్తున్నారు .

జగన్ రాష్ట్రంలో సినీ పరిశ్రమ వర్గాలకు రీస్టార్ట్ ప్యాకేజ్

జగన్ రాష్ట్రంలో సినీ పరిశ్రమ వర్గాలకు రీస్టార్ట్ ప్యాకేజ్

మరో పోస్ట్ లో రాష్ట్రంలో ప్రతి పరిశ్రమను కాపాడడం కోసం సీఎం జగన్ తగిన చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్న విజయసాయిరెడ్డి ఫిల్మ్ ఇండస్ట్రీ కోసం రీస్టార్ట్ ప్యాకేజీ ప్రకటించడం అందుకు ఉదాహరణ అని పేర్కొన్నారు . ప్రతి పరిశ్రమపై సిఎం వైయస్ జగన్ ప్రత్యేకమైన దృష్టి సారిస్తున్నారని తెలిపారు. స్థిర విద్యుత్ ఛార్జీలు, వర్కింగ్ క్యాపిటల్ లోన్లు, ఇఎంఐలపై తాత్కాలిక నిషేధం, వడ్డీ ఉపసంహరణ వంటి వెసులుబాటు కల్పించి కరోనా మహమ్మారి దెబ్బకు కుదేలైన పరిశ్రమకు బాసటగా వైయస్ జగన్ నిలుస్తున్నారని పేర్కొన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+