చిట్టి నాయుడు దెబ్బ.. అచ్చెన్న అబ్బా.. చంద్రబాబు బట్టలు చించుకునేది అందుకే : విజయసాయి

టిడిపి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అరెస్ట్ ఇప్పుడు ఏపీలో దుమారంగా మారింది. అచ్చెన్నాయుడు అరెస్ట్ పై చంద్రబాబునాయుడు చేస్తున్న రాజకీయం చాలా దారుణంగా ఉంది అంటూ వైసీపీ ఎంపీ విజయసాయి చంద్రబాబు టార్గెట్ గా విమర్శనాస్త్రాలు సంధించారు. చంద్రబాబు నాయుడు అచ్చెన్నాయుడు అరెస్ట్ ను రాద్ధాంతం చేయాలని చూస్తున్నాడని, దీన్ని కూడా రాజకీయం చేస్తున్నాడని విమర్శించిన విజయసాయిరెడ్డి అరెస్టు చేస్తే కిడ్నాప్ ఎలా అవుతుంది చంద్రబాబు అంటూ ప్రశ్నించారు.

 గొడవలు సృష్టించాలన్న కుట్రతో కిడ్నాప్ అని హంగామా

గొడవలు సృష్టించాలన్న కుట్రతో కిడ్నాప్ అని హంగామా

గొడవలు సృష్టించాలన్న కుట్రతో కిడ్నాప్ అని హంగామా చేశారంటూ పేర్కొన్న విజయసాయి ఇక అచ్చెన్నాయుడు అరెస్ట్ పై ఏసీబీ అన్ని ప్రోటోకాల్స్ పాటించింది అని పేర్కొన్నారు. అచ్చెన్నాయుడు కుటుంబ సభ్యులు సైతం కిడ్నాప్ అనలేదని చంద్రబాబు నానా హంగామా చేస్తున్నారని మండిపడ్డారు. ఇక చంద్రబాబు కైతే ఒక న్యాయం, వేరే వారికైతే ఇంకొక న్యాయం ఉంటుందా అంటూ ప్రశ్నించిన విజయసాయిరెడ్డి ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్ గా దొరికినపుడు ప్రభుత్వంపై గర్జించారు కదా చంద్రబాబు మీకు ఏసీబీ ఉంటే నాకు ఏసీబీ ఉంది అంటూ నానా హంగామా చేసావు కదా.. ఇప్పుడు అవినీతి కుంభకోణంలో అచ్చెన్నాయుడుని అరెస్టు చేసేటప్పటికి ఏసీబీ కాస్తా చట్టవిరుద్ధ సంస్థ అయిపోయిందా అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు.

అచ్చెన్న ను ఇరికించింది చిట్టి నాయుడు టీం

అచ్చెన్న ను ఇరికించింది చిట్టి నాయుడు టీం

అవినీతి మూలాలు కదులుతున్నాయని భయం పట్టుకుందా చంద్రబాబు అంటూ ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై విరుచుకుపడ్డారు విజయసాయి. ఇక అంతే కాదు చిట్టి నాయుడు దెబ్బ, అచ్చెన్న అబ్బా అంటూ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు .టీడీపీ అధ్యక్ష పదవికి ఎర్రన్న కుటుంబం పోటీకి వస్తుందని 900 కోట్ల మందుల కుంభకోణంలో కీలక డాక్యుమెంట్లను లీక్ చేసిన చిట్టి నాయుడు టీం అధికారంలో ఉన్నప్పుడు అవినీతి చేయించడం, వాటాలు పంచుకోవడం, అడ్డం తిని అనుమానం రాగానే లీకులిచ్చి ఇరికించడం ఇది చిట్టి నాయుడు గ్యాంగ్ కు అలవాటే అని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. అచ్చన్న ఎవరెవరు వాటాలు పంచుకున్నారో ఏసీబీకి వెల్లడించాలి అంటూ విజయ సాయి రెడ్డి పేర్కొన్నారు.

తప్పుడు పనికి కులాన్ని అంటగడుతున్న పచ్చ మంద : సైరా పంచ్

తప్పుడు పనికి కులాన్ని అంటగడుతున్న పచ్చ మంద : సైరా పంచ్

ఇక అంతే కాదు సైరా పంచ్ కూడా వేశారు విజయసాయిరెడ్డి. అమరావతి భూ కుంభకోణంపై దర్యాప్తు ఆదేశిస్తే కమ్మ కులం మీద కక్ష సాధింపు, ఇక తప్పతాగి రోడ్డుపై న్యూసెన్స్ చేస్తున్న పిచ్చోడిని అదుపులోకి తీసు కుంటే దళితుల మీద కక్ష సాధింపు,900 కోట్ల ఈఎస్ఐ స్కాం లో అచ్చెన్నాయుడుని అరెస్టు చేస్తే బీసీల మీద కక్ష సాధింపు అంటూ చేసిన ప్రతి తప్పుడు పనికి కులాన్ని అంటగడుతున్న పచ్చ మంద అంటూ సైరా పంచ్ వేశారు.

బాబుపై విజయసాయి వ్యంగ్యాస్త్రాలు

బాబుపై విజయసాయి వ్యంగ్యాస్త్రాలు

ఇక దిగువస్థాయి కార్మికులు, వారు పనిచేసే సంస్థలు చెల్లించే కాంట్రిబ్యూషన్ తో నడిచే ఈఎస్ఐలో తొమ్మిది వందల కోట్ల అవినీతికి పాల్పడడం సిగ్గుచేటని అనిపించడంలేదా బాబు గారు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు హెరిటేజ్ నెయ్యి కొనుగోలులో లీటరుకు 150 రూ ఎక్కువ వసూలు చేశారు. ఇక ప్రజాధనం ఉన్నది దోచుకోవడానికి అన్నట్టుగా జరిగింది మీ పాలన అంటూ విజయసాయి రెడ్డి చంద్రబాబును తూర్పారబట్టారు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+