Vijayawada: విజయవాడలో నాన్ వెజ్ ప్రియులకు బ్యాడ్ న్యూస్..!

ఏపీలో మంసాహార అమ్మకాలు ఎక్కువగా ఉండే విజయవాడ(vijayawada)లో నాన్-వెజ్ (meat) ప్రియులకు ఓ బ్యాడ్ న్యూస్. విజయవాడలో రేపు అన్ని రకాల మాంసాహార అమ్మకాలను నిషేధిస్తూ నగర పాలక సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ థ్యాన్ చంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. రిపబ్లిక్ డే సందర్బంగా నాన్-వెజ్ అమ్మకాలు జరగకుండా నిషేధం విధిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ ఓ ప్రకటనలో తెలిపారు.

గణతంత్ర దినోత్సవం సందర్భంగా విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ ఉత్తర్వుల మేరకు 26-01-2026 తేదిన (సోమవారం) నగరంలో ఉన్న కబేళాకు సెలవు అని చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె.అర్జునరావు ప్రకటించారు. కాబట్టి ఆదివారం రాత్రి నుండి కబేళాలో ఎటువంటి జంతువులను వధించేందుకు అనుమతి లేదన్నారు. అలాగే నగరంలో ఉన్న అన్ని చికెన్ షాపులు, మటన్ షాపులు, చేపల మార్కెట్లు అన్నీ తెరిచేందుకు ఎలాంటి అనుమతీ లేదన్నారు.

Vijayawada municipal corporation bans all non-veg sales tomorrow on the eve of republic day

అలాగే రేపు గణతంత్ర దినోత్సవం రోజు ఎవరైనా అనుమతి లేకుండా మూగ జీవాలను వధించినా, లేదా షాపులను తెరిచినా, మటన్, చికెన్, చేపలను అమ్మినా చట్ట ప్రకారం వారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. కావున మటన్, చికెన్, చేపలు హోల్ సేల్ రిటైల్ వ్యాపారస్తులు అన్ని షాపులు మూసేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఎక్కడికక్కడ షాపుల వద్ద నిషేధాజ్ఞలు విధిస్తున్నారు. దీంతో రేపు ఒక్కరోజు నాన్-వెజ్ ప్రియులకు ఇబ్బందులు తప్పవు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+