Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చెడ్డీ గ్యాంగ్ కు బెజవాడ పోలీసుల చెక్-ముగ్గురు గుజరాతీల అరెస్టు-నేరాల విధానం ఇలా..

విజయవాడలో కలకలం రేపుతున్న చెడ్డీ గ్యాంగ్ కు పోలీసులు చెక్ పెట్టారు. చెడ్డీ గ్యాంగ్ కు చెందిన ముగ్గురు సభ్యుల్ని గుజరాత్ కు వెళ్లి మరీ అరెస్టు చేశారు. వీరి నుంచి విలువైన పస్తువుల్ని సైతం స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాల్ని నగర పోలీసు కమిషనర్ క్రాంతి రాణా టాటా వెల్లడించారు.

విజయవాడ నగర ప్రజలను బయబ్రాంతులకు గురి చేసి వివిధ నేరాలకు పాల్పడిన గుజరాత్ కు చెందిన చెడ్డీ గ్యాంగ్ సభ్యులలో ముగ్గురు అరెస్ట్ అయినట్లు పోలిస్ కమిషనర్ కాంతి రాణా టాటా తెలిపారు. ఈ మధ్య కాలంలో నగర శివారు ప్రాంతాలలో జరిగిన దొంగతనాలు పై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆయన వెల్లడించారు. దొంగతనాల నియంత్రణకై పోలీసు గస్తీని ముమ్మరం చేయడంతో పాటు పాత నేరస్థులు, జైలు నుండి విడుదలైన నేరస్థులు, అనుమానాస్పద వ్యక్తులు, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన నేరస్తుల పై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశామన్నారు. విజయవాడ టూటౌన్, ఇబ్రహీంపట్నం మరియు పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలలో దొంగతనం జరిగినట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చేపట్టినట్లు కమిషనర్ వెల్లడించారు. టూటౌన్ ఇన్ స్పెక్టర్ మోహన్ రెడ్డ పెనమలూరు ఇన్ స్పెక్టర్ సత్యనారాయణ, సి.సి.ఎస్. సిబ్బందితో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి 3 కేసులలో ముద్దాయిలను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.

vijayawada police put check to cheddi gang, three gujaratis arrested, commisioner reveal details

గుజరాత్ కు చెందిన మడియా కాంజీ, సక్ర మండోడ్, కమలేష్ బాబేరియా ను ఆరెస్ట్ చేసినట్లు కమిషనర్ వెల్లడించారు. నేరానికి వచ్చేటప్పుడు వీరు నిక్కరు ధరిస్తారు కాబట్టి వీరిని చెడ్డీ గ్యాంగ్ అని పిలుస్తున్నట్లు ఆయన తెలిపారు. వీరు కూలి పనులు చేసుకుంటూ ఉంటారని, కూలి పనులు లేని సమయంలో డబ్బుల కోసం రైళ్ళలో ప్రయాణ చేసి ఇతర రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ నగర శివారు నిర్మానుష్య ప్రదేశాలలో ఉండే ఇళ్ళు, అపార్ట్ మెంట్ లను పగలు సమయంలో రెక్కి నిర్వహించి రాత్రి సమయంలో వెళ్లి ఇంటి తాళాలు పగులకొట్టి ఇళ్ళల్లో ఉన్న నగదు, బంగారం మరియు ఇతర విలువైన వస్తువులను దొంగిలించుకొని వెళుతూ ఉంటారని కమిషనర్ తెలిపారు.పై నేరాలను వీరు రెండు గ్యాంగ్ లుగా విడిపోయి నేరాలకు పాల్పడ్డారన్నారు. వారిలో ముగ్గురిని అరెస్ట్ చేశామని, మిగిలిన నిందితులను కూడా త్వరలో అరెస్ట్ చేస్తామన్నారు.

vijayawada police put check to cheddi gang, three gujaratis arrested, commisioner reveal details

వీరి నుంచి రూ.20 వేల నగదు, 32 గ్రాముల బంగారం, 2.5 కేజీల వెండి స్వాధీనం చేసుకున్నారు. పై కేసులలో దర్యాప్తులో భాగంగా నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేయడంలో చురుగ్గా వ్యవహరించి విధి నిర్వహణలో ప్రతిభ చూపిన పోలీస్ అధికారులు మరియు సిబ్బందిని కమిషనర్ అభినందించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+