జేసీ దివాకర్ రెడ్డి కేసు కొట్టేసిన స్పెషల్ కోర్టు, అధికారంలో సొంత పార్టీ, తాడిపత్రి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, మాజీ ఎంపీ, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు జేసీ దివాకర్ రెడ్డి ఊపిరిపీల్చుకున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో నమోదు చేసిన కేసుకు సంబంధించి విచారణ ఎదుర్కొంటున్న అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఇప్పుడు అదే కేసు నుంచి విముక్తిపొందారు. న్యాయం గెలిచిందని, గత వైసీపీ ప్రభుత్వంలో తమ మీద, తమ అనుచరుల మీద తప్పుడు కేసులు పెట్టి వేధించారని జేసీ దివాకర్ రెడ్డి అనుచరులు అంటున్నారు.
2019లో ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. 2019 డిసెంబర్ 19వ తేదీన అప్పటి ప్రతిపక్ష నాయకుడు, టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు అనంతపురంలో పర్యటించారు. ఆ రోజు అనంతపురం జిల్లా డీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చంద్రబాబు నాయుడుతో పాటు అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడారు.

ఆ సందర్బంలో పోలీసుల మీద మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పటి ఏఎస్ఐ త్రిలోక్ నాథ్ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మీద పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో ఆయన మీద అనేక సెక్షన కింద అనంతపురం సిటీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ సందర్బంలో తన మీద అక్రమంగా కేసులు నమోదు చేశారని, జగన్ ఒత్తిడితోనే పోలీసులు కేసు నమోదు చేశారని జేసీ దివాకర్ రెడ్డి ఆరోపించారు.

తరువాత కేసు విజయవాడలోని ప్రజా ప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానంకు బదిలి అయ్యింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు జేసీ దివాకర్ రెడ్డి కేసు విచారణ జరిగింది. అయితే జేసీ దివాకర్ రెడ్డి మీద నమోదు అయిన కేసులో ఆయన నేరానికి పాల్పడ్డారని ఎలాంటి సాక్షాలు నిరూపణకాలేదని, ఆయన నిరపధిగా ప్రకటిస్తూ కేసు కొట్టి వేస్తున్నామని సోమవారం విజయవాడలోని ప్రజా ప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. జేసీ దివాకర్ రెడ్డి మీద నమోదు అయిన కేసు కొట్టివేయడంతో తాడిపత్రి నియోజక వర్గంతో పాటు అనంతపురం జిల్లాలోని జేసీ అనుచరులు సంబరాలు చేసుకుంటున్నారు.
-
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications