సికింద్రాబాద్ -విశాఖ రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్- రేపు ఎల్లుండి మీ కోసం..!
పండుగల వేళ తెలుగురాష్ట్రాల మధ్య ప్రయాణించే రైళ్లలో ప్రయాణికుల రద్దీ అంతకంతకూ పెరుగుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు ఎప్పటికప్పుడు ప్రత్యేక రైళ్లను ప్రకటిస్తూనే ఉన్నారు. అయినా రద్దీ మాత్రం తగ్గడం లేదు. టికెట్లు దొరకడం లేదనే ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో దక్షిణ కోస్తా రైల్వే ఇవాళ సికింద్రాబాద్-విశాఖపట్నం మార్గంలో (Visakhapatnam-Secunderabad Special Trains) రెండు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ రైళ్ల షెడ్యూల్, ఇతర వివరాలను కూడా వెల్లడించింది.
విశాఖపట్నం, సికింద్రాబాద్ మధ్య ప్రయాణికుల రద్దీని తట్టుకునేందుకు రెండు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు విజయవాడ డివిజన్ ప్రకటించింది. ఈ మేరకు రెండు రైళ్ల వివరాలను ప్రకటించింది. ఇందులో రైలు నంబర్ 07069: సికింద్రాబాద్ - విశాఖపట్నం ఎక్స్ప్రెస్ అక్టోబర్ 16న అందుబాటులో ఉంటుంది. అలాగే రైలు నంబర్ 07070: విశాఖపట్నం - సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ అక్టోబర్ 17న నడపనున్నారు.

ఈ రెండు ప్రత్యేక రైళ్లు మార్గమధ్యంలో రెండువైపులా చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, తుని, అనకాపల్లి, దువ్వాడ స్టేషన్లలో ఆగుతాయి. ఈ రైళ్లు ప్రధానంగా విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి తదితర ప్రాంతాల నుంచి సికింద్రాబాద్కు, తిరుగు ప్రయాణంలో సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నానికి వెళ్లే ప్రయాణికులకు ఉపయోగపడనున్నాయి. కాబట్టి ఈ ప్రత్యేక రైళ్ల సేవలను ఉపయోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు.














Click it and Unblock the Notifications
