వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలిస్తే ఇలా జరక్కపోయేది: ఉదయ్ కిరణ్ మృతిపై భార్య

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఉదయ్ కిరణ్ సమస్య గురించి ముందే తెలిసి ఉంటే ఈ ఘటన జరిగి ఉండేది కాదని ఆయన సతీమణి విషిత ఆవేదన వ్యక్తం చేశారు. టాలీవుడు ప్రముఖ హీరో ఉదయ్ కిరణ్ ఇటీవల ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఉదయ్ కిరణ్ మృతిని తాము జీర్ణించుకోలేకపోతున్నామని విషిత గురువారం అన్నారు. ఆయన సమస్య ముందుగానే తెలిస్తే ఎంతోమంది సాయం చేసేవారని, ఈ ఘటన జరిగి ఉండేది కాదన్నారు.

కాగా, ఉదయ్ స్టార్ ఇమేజ్ నుండి బయటపడలేకపోయారని ఆయన భార్య విషిత పోలీసుల వాంగ్మూలంలో చెప్పినట్లుగా ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దర్యాఫ్తులో భాగంగా పోలీసులు విషితను అప్పుడు విచారించారు. శనివారం బంజారాహిల్స్‌లో పోలీసులు విషిత వాంగ్మూలాన్ని తీసుకున్నారు.

Vishitha on Uday Kiran's death

తన భర్త ఆత్మహత్యకు పాల్పడిన రోజున భర్తే తనను తన స్నేహితుడు (శరత్) పుట్టిన రోజు వేడుకలకు పంపించాడని ఆమె పోలీసులకు చెప్పినట్లుగా తెలుస్తోంది. శరత్ తనకు అన్నలాంటి వాడని చెప్పారు. స్టార్ ఇమేజ్ చట్రం నుండి ఉదయ్ కిరణ్ బయట పడలేకపోయారని, చెన్నైలో జరిగిన భారతీయ సినిమా వందేళ్ల సినిమా వేడుకకు ఆహ్వానం రాలేదని మదనపడ్డాడని విషిత పోలీసులకు తెలిపారని తెలుస్తోంది.

పెళ్లి సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పెద్దగా పట్టించుకోలేదని, ఆరు నెలల తర్వాత అవి తీవ్రమయ్యాయని, క్రమంగా సర్దుకుంటాయని చెప్పినప్పటికీ అలా జరగలేదన్నారు. కాగా, తామిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నామని, వివాహానికి ఉదయ్ కిరణ్ తండ్రి రాలేదని విషిత చెప్పిన విషయం తెలిసిందే.

వివాహానికి ముందు ఉదయ్ కిరణ్‌తో ఏడాదిన్నర పాటు ప్రేమాయణం సాగించినట్టు ఆయన భార్య విషిత చెప్పింది. పెళ్లికి ముందు తాను, ఉదయ్ కిరణ్ ఏడాదిన్నర ప్రేమించుకున్నామని, ఆ మధ్య కాలంలో తాము మనస్సు విప్పి అన్ని అంశాలపై మాట్లాడుకునేవాళ్లమని విషిత పోలీసులకు చెప్పినట్లు సమాచారం. తమ మధ్య పెళ్లికి ముందు లేదా వివాహం తర్వాత ఎలాంటి మనస్పర్థలు లేవని స్పష్టం చేసింది.

English summary
Tollywood Hero Uday Kiran's wife Vishitha on Thursday 
 
 responded on her husband's death.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X