క్షమించండి.. మళ్లీ నోరు జారను !!

కత్తి కాంతారావు జాతీయ పురస్కార ప్రధానోత్సవంలో రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దివంగత నటుడు కాంతారావు గొప్పతనాన్ని వివరిస్తూ లెజెండరీ నటుడు, మాజీ సీఎం ఎంజీఆర్ పై చేసన కామెంట్స్ దుమారాన్ని లేపుతున్నాయి. కాంతారావు జానపద చిత్రాలను అప్పట్లో పడి పడి చూసేవారని చెప్పుకొచ్చారు. కాంతారావుని చూస్తే ఎంజీఆర్ వణికిపోయేవారని.. ఉ* పోసుకుంటూ వెళ్లిపోయేవారని మాట్లాడారు. అయితే రాజేంద్రప్రసాద్ ఉపయోగించిన పదజాలంపై తమిళ తంబీలు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే నటుడు విశాల్, నాజర్ సైతం సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అయ్యారు. రాజేంద్రప్రసాద్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

ఈ క్రమంలోనే ఇప్పుడు నటుడు రాజేంద్రప్రసాద్‌ క్షమాపణలు చెప్పారు. తమిళ లెజెండరీ నటుడు ఎంజీఆర్‌పై తాను చేసిన వ్యాఖ్యల పట్ల చింతిస్తున్నానని వ్యాఖ్యానించారు. అవి ఉద్దేశపూర్వకంగా అన్న మాటలు కాదని, అనుకోకుండా దొర్లాయని విచారం వ్యక్తం చేశారు. ఇంకెప్పుడూ అలాంటి వ్యాఖ్యలు చేయనని తెలిపాడు. ఈ మేరకు తమిళంలో క్షమాపణలు చెప్తూ ఓ వీడియో రిలీజ్‌ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

senior-actor-rajendra-prasad-apologies-about-his-comments-on-tamil-actor-and-ex-cm-mgr-and-video-got

గతంలో సైతం రాజేంద్ర ప్రసాద్ డేవిడ్ వార్నర్ ను దొంగ ము** కొడుకు, రేయ్ అంటూ వ్యాఖ్యానించి అనవసరంగా చిక్కుల్లో పడ్డారు. ఆ తర్వాత నటుడు అలీపై, బ్రహ్మానందంపై సభా ముఖంగానే కామెంట్స్ సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. కేవలం రాజేంద్ర ప్రసాద్ మాత్రమే కాకుండా సినిమా కార్యక్రమాలు, ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ఇంటర్వ్యూ లలో మాట్లాడుతూ నటీనటులు ఓవర్ గా కామెంట్స్ చేస్తున్న ఘటనలు ఇటీవల వరుసగా చోటు చేసుకుంటున్నాయి.

రాజేంద్రప్రసాద్ సినీ కెరీర్..

ఇక నటకిరీటి రాజేంద్రప్రసాద్ దశాబ్దాలుగా తనదైన నటనతో ఆడియన్స్ ని అలరిస్తున్నారు. ముందుగా డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి తర్వాత చిన్న చిన్న పాత్రలు, ఆపై క్యారెక్టర్ రోల్స్... అలా ఒక్కో మెట్టు ఎక్కుతూ హీరోగా మారారు. తన కెరీర్‌లో 200కు పైగా సినిమాల్లో నటించగా.. అందులో ఎన్నో సూపర్ హిట్‌లు ఉన్నాయి. ఒకప్పుడు హీరోగా మెప్పించిన ఆయన.. ఇప్పుడు సహాయ నటుడి పాత్రలతో కొనసాగుతున్నారు. అయినప్పటికీ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+