జగన్‌కు లాభమే, పవన్ మంచే చేస్తున్నారు: టిడిపికి విష్ణు ఝలక్, వైసిపి నిర్ణయం సరికాదు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తే ఆ పార్టీకి ఎంతో కొంత ఉపయోగపడుతుందని బిజెపి శాసన సభా పక్ష నేత విష్ణు కుమార్ రాజు అన్నారు.

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తే ఆ పార్టీకి ఎంతో కొంత ఉపయోగపడుతుందని బిజెపి శాసన సభా పక్ష నేత విష్ణు కుమార్ రాజు అన్నారు.

చదవండి: జనసేన ఆఫీస్ ప్రారంభం, ఖురాన్ పఠించిన అలీ: అతిథిగా సామాన్యుడు, ఏం కావాలని పవన్ అడిగితే (ఫోటోలు)

ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఈ సందర్భంగా టిడిపికి షాకిచ్చే వ్యాఖ్యలు చేశారు. జగన్ పాదయాత్ర చేస్తే తమకే లాభమని టిడిపి చెబుతోంది. అయితే పాదయాత్ర జగన్‌కు ఎంతో కొంత ఉపయోగపడుతుందన్నారు.

చదవండి: చంద్రబాబుపై అవకాశం: అలా చేస్తే జగన్ సెల్ఫ్‌గోల్, టిడిపికి ఆయుధం

టిడిపికి ఝలక్

టిడిపికి ఝలక్

జగన్ పాదయాత్రతో వైసిపికి లాభం ఉండదనే టిడిపి నేతల మాటలపై ఆయన స్పందించారు. అది కరెక్టు కాదన్నారు. పాదయాత్ర వల్ల ప్రయోజనం ఉంటుందన్నారు. దీంతో ప్రజల వద్దకు నాయకులు వెళ్లవచ్చునని, అదే మాదిరి నాయకులు తమ వద్దకు వస్తున్నారనే భావన ప్రజలకు కలుగుతుందన్నారు.

నడవడం సాధారణ విషయం కాదు

నడవడం సాధారణ విషయం కాదు

వేల కిలోమీటర్లు నడవటం అంటే సాధారణ విషయం కాదని విష్ణు అన్నారు. ధృడ సంకల్పం, అంకితభావం ఉండాలన్నారు. లేదంటే పాదయాత్ర చేయడం కష్టమని చెప్పారు. పాదయాత్రకు బ్రేక్ ఇవ్వడం జగన్‌కు కూడా మంచిదే అన్నారు.

వైసిపి ఆలోచన సరికాదు

వైసిపి ఆలోచన సరికాదు

అసెంబ్లీ శీతాకాల సమావేశాలను బహిష్కరించాలనే వైసిపి ఆలోచన సరికాదని విష్ణు అన్నారు. ప్రజలకు మంచి సంకేతం ఇచ్చినట్లు కాదన్నారు. జగన్ ఎలా ఆలోచిస్తున్నారో మాకు తెలియదన్నారు. ప్రతిపక్షాలకు అసెంబ్లీయో మంచి అవకాశమన్నారు.

పవన్ కళ్యాణ్ పైన ఇలా

పవన్ కళ్యాణ్ పైన ఇలా

రాజకీయాల్లోకి పవన్ కళ్యాణ్ రావడం చాలా సంతోషమని విష్ణు అన్నారు. ఓ రాజకీయ నేతగా ప్రజలకు దగ్గరయ్యేందుకు ఆయన చేస్తున్న కార్యక్రమాలు మంచివే అన్నారు. పవన్ కళ్యాణ్ పాదయాత్ర చేసినా ఉపయోగం ఉంటుందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+