చంద్రబాబుపై అవకాశం: అలా చేస్తే జగన్ సెల్ఫ్‌గోల్, టిడిపికి ఆయుధం

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: ఏపీ శాసనసభ, శాసనమండలి సమావేశాలు నవంబరు 10వ తేదీ నుంచి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 10 రోజులు సభ జరుగుతుంది.

  TOP 10 NEWS Today టుడే టాప్ 10 న్యూస్ | Oneindia Telugu

  కోర్టు షాక్, డీలాపడ్డ జగన్ ఇలా: అసెంబ్లీ బాధ్యత పెద్దిరెడ్డికి, బడ్జెట్‌కు రావాల్సిందే

  మధ్యలో వచ్చే సెలవులు కూడా కలిపితే నవంబరు నాలుగో వారం వరకు సమావేశాలు కొనసాగుతాయి. బడ్జెట్‌ సమావేశాలు మార్చిలో జరగ్గా మే 16న జీఎస్టీ బిల్లు ఆమోదం కోసం శాసనసభను ప్రత్యేకంగా సమావేశపరిచారు.

  'జగన్ పని అయిపోయింది': వారానికోసారి వస్తే ఇబ్బందేటి, మీకే రెస్ట్, జనాలకు అదే చెప్పండి,.. కోర్టు

  సమావేశాలు బహిష్కరించే యోచన

  సమావేశాలు బహిష్కరించే యోచన

  ఏపీ శాసన సభ సమావేశాలు వచ్చే నెలలో నిర్వహించడంపై వైసిపి విమర్శలు చేస్తోంది. అంతేకాదు నవంబర్ 2న లేదా 6వ తేదీ నుంచి వైసిపి అధినేత వైయస్ జగన్ పాదయాత్ర ప్రారంభం కానుంది. జగన్ పాదయాత్ర సమయంలో ఉద్దేశ్యపూర్వకంగా సమావేశాలు నిర్వహిస్తున్నారని, ఈ నేపథ్యంలో సమావేశాలు బహిష్కరించాలని వైసిపి భావిస్తోంది.

  సమావేశాలు బహిష్కరిస్తే సెల్ఫ్ గోల్

  సమావేశాలు బహిష్కరిస్తే సెల్ఫ్ గోల్

  సమావేశాలను బహిష్కరించే అంశాన్ని వైసిఎల్పీ భేటీలో ఈ నెల 26న నిర్ణయం తీసుకోనున్నారు. జగన్ అందరి అభిప్రాయాలు తీసుకుంటారు. అయితే సమావేశాలను బహిష్కరిస్తే అది సెల్ఫ్ గోల్ అవుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి.

  హాజరయితే అవకాశం

  హాజరయితే అవకాశం

  వైసిపి చెప్పినట్లుగా జగన్ పాదయాత్రను చూసుకొని అధికార పార్టీ సమావేశాలు నిర్వహిస్తుండవచ్చు. అధికార పార్టీ కుట్ర చేసినా, జగన్ లేకపోయినా ప్రజా సమస్యలపై చర్చించాలనే చిత్తశుద్ధితో తాము హాజరవుతున్నామని చెప్పేందుకు ఆస్కారం ఉంటుందని, బహిష్కరిస్తే అది వైసిపికే నష్టమని అంటున్నారు. పార్టీ మారిన వారిపై చర్యలు తీసుకుంటారా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే సభా సాక్షిగా లేవనెత్తే ఆస్కారం ఉంది.

  అలా చేస్తే వ్యతిరేక సంకేతాలు

  అలా చేస్తే వ్యతిరేక సంకేతాలు

  సమావేశాలను బహిష్కరిస్తే.. కేవలం జగన్ పాదయాత్ర కోసమే వైసిపి ఇలా చేసిందని టిడిపి నేతలు విమర్శించేందుకు ఆస్కారం దొరకడమే కాకుండా, ప్రజల్లోకి కూడా వ్యతిరేక సంకేతాలు వెళ్తాయని వైసిపిలో కొందరు భావిస్తున్నారట. కాబట్టి బహిష్కరించకపోవడమే ఉత్తమం అని కొందరు అభిప్రాయపడినట్లుగా తెలుస్తోంది.

  అధికార పార్టీకి ఆయుధం ఇచ్చినట్లే

  అధికార పార్టీకి ఆయుధం ఇచ్చినట్లే

  ఇప్పటికే నంద్యాల ఉప ఎన్నికలు, కాకినాడ మున్సిపల్ ఎన్నికలతో వైసిపి కేడర్ కొంత డీలాపడింది. పాదయాత్ర కోసం జగన్‌కు కోర్టు నుంచి మినహాయింపు వస్తుందని భావించారు. సిబిఐ కోర్టులో చుక్కెదురయింది. వీటికి తోడు సమావేశాలను బహిష్కరిస్తే.. అధికార పార్టీకి ఓ ఆయుధం ఇచ్చినట్లుగా అవుతుందని భావిస్తున్నారట.

  అలా చేస్తేనే మంచిది

  అలా చేస్తేనే మంచిది

  సమావేశాలకు హాజరు కాకుండా ఉంటే అధికార పార్టీ ఏకపక్షంగా నిర్వహించుకునేందుకు అవకాశముంటుందని అంటున్నారు. బహిష్కరించకుండా సమావేశాలకు హాజరై ప్రజా సమస్యలపై అధికార పార్టీని నిలదీసినా, అప్పడు బహిష్కరించినా ప్రజల్లోకి మంచి సంకేతాలు వెళ్తాయని భావిస్తున్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  It is said that YSR Congress Party may boycott winter assembly sessions. YSR Congress Party chief YS Jaganmohan Reddy is asking party leaders on boycotting next assembly sessions.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి