పరిటాల ఫ్యామిలీపై అభిమానంతోనే, ఆదర్శంగా చేస్తా: రక్తచరిత్ర హీరో వివేక్ ఒబెరాయ్
అనంతపురం: తాను దత్తత తీసుకున్న ముత్తవకుంట గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చి దిద్దుతానని బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ చెప్పారు. నిరోద్యగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా ముత్తువకుంట గ్రామాన్ని వివేక్ ఒబెరాయ్ దత్తత తీసుకున్నారు. పరిటాల రవీంద్ర కుటుంబంపై అభిమానంతోనే ఆ గ్రామాన్ని దత్తతు తీసుకున్నట్లు ఆయన చెప్పారు.
తాను దత్తత తీసుకున్న గ్రామంలో ఆయన మంగళవారంనాడు పర్యటించారు. రక్త చరిత్ర సినిమాలో పరిటాల రవీంద్ర పాత్ర ద్వారా అనంతపురం ప్రజలను బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ అలరించిన విషయం తెలిసిందే.

అనంతపురం జిల్లా ప్రజలతో సన్నిహిత సంబంధాలను పెంచుకోవడం కోసం ఆయన కరువు కాటకాలకు నిలయమైన అనంతపురం జిల్లాలోని ముత్తవకుంట్ల గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. గ్రామంలో పాఠశాల, సీసీరోడ్ల నిర్మాణానికి సంబంధించిన పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
అనంతపురం జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు పరిటాల రవీంద్ర హత్యకు గురైన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications