Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

విద్యార్ధులు చదవట్లేదని గుంజీలు తీసిన హెడ్మాస్టర్-లోకేష్ రియాక్షన్ ఇదే..!

ఏపీలో విద్యార్ధులకు విద్యాబుద్దులు చెప్పాల్సిన ఉపాధ్యాయులు దారి తప్పుతున్న ఘటనలు చూస్తున్నాం. కానీ విజయనగరం జిల్లాలో ఓ ప్రధానోపాధ్యాయుడు మాత్రం విద్యార్ధులకు అవే పాఠాలు చెప్పి వారిని ఉన్నత స్ధానాలకు తీసుకెళ్లాలని భావించాడు. కానీ వారు, వారి తల్లితండ్రుల నుంచి ఆయనకు ఆశించిన సహకారం అందలేదు. దీంతో అన్ని ప్రయత్నాలు చేసి విఫలమైన సదరు హెడ్మాస్టర్ తనకు తానే శిక్ష విధించుకున్నారు. ఆ హెడ్మాస్టర్ పేరు చింతా రమణ.

విద్యార్థులను వారి తల్లిదండ్రులు కంట్రోల్ చేయట్లేదని విజయనగరం జిల్లా బొబ్బిలిలోని పెంట జడ్పీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చింతా రమణ గుంజీలు తీసి వారికి దండం పెట్టారు. జిల్లాలోని బొబ్బిలి మండలం పెంట గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకి చెందిన విద్యార్థులు చదువులో వెనుకబడ్డారని హెడ్మాస్టర్ రమణ ఆవేదన వ్యక్తంచేశారు. ఇవాళ పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులను హాజరుపర్చి, వారి ఎదురుగా వున్న స్టేజిపై నుండి మాట్లాడారు.

Vizianagaram school headmaster took self punishment after fails to control students Lokesh reacted

మీరంతా చదువులో వెనుకబడ్డారని 'మేము మిమ్మల్ని కొట్టలేము, తిట్టలేమ, ఏమీ చేయలేము, మీ దగ్గర చేతకాని వారిలాగా చేతులు కట్టుకుని ఉండాల్సిన పరిస్థితి వచ్చిందంటూ రమణ ఆవేదన వ్యక్తంచేశారు. అనంతరం విద్యార్థుల ముందు సాష్టాంగ నమస్కారం చేశారు. అంతటితో ఆగకుండా గుంజీలు కూడా తీయడం మొదలుపెట్టారు. హెడ్మాస్టర్ చర్యతో మొదట అవాక్కయిన విద్యార్థులు వద్దు సార్..గుంజీలు తీయవద్దంటూ వేడుకున్నారు.అయినా ఆయన మాత్రం ఆగలేదు.

అయితే ఇలా హెడ్మాస్టర్ విద్యార్ధుల చదువులపై ఇంత పట్టుబట్టడానికి కారణం విద్యాశాఖ 100 శాతం ఫలితాలు సాధించాలంటూ పెంచుతున్న ఒత్తిడే అన్న విమర్శలు వచ్చాయి. దీంతో మంత్రి నారా లోకేష్ దీనిపై స్పందించారు. విజ‌య‌న‌గ‌రం జిల్లా, బొబ్బిలి మండ‌లం, పెంట జెడ్పీ హైస్కూల్ హెడ్మాస్ట‌ర్ చింత ర‌మ‌ణ గారు పిల్ల‌ల విద్యా పురోగ‌తి అంతంత‌మాత్రంగా ఉంద‌ని, చెప్పిన మాట విన‌డంలేద‌ని....విద్యార్థుల‌ను దండించ‌కుండా, గుంజీలు తీసిన‌ వీడియో సోష‌ల్ మీడియా ద్వారా తన దృష్టికి వ‌చ్చిందన్నారు.

హెడ్మాస్ట‌రు గారూ! అంతా క‌లిసి ప‌నిచేసి, ప్రోత్సాహం అందిస్తే మ‌న ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌ పిల్ల‌లు అద్భుతాలు సృష్టిస్తారని లోకేష్ తెలిపారు. వారిని దండించ‌కుండా అర్థం చేసుకునేలా మీ స్వీయ‌క్ర‌మ‌శిక్ష‌ణ చ‌ర్య‌ ఆలోచ‌న బాగుందన్నారు. ఆయననకు అభినంద‌న‌లు తెలిపారు. అందరం క‌లిసి విద్యాప్ర‌మాణాలు పెంచుదామని సూచించారు. పిల్ల‌ల విద్య‌, శారీర‌క‌, మాన‌సిక వికాసానికి కృషిచేసి, వారి బంగారు భ‌విష్య‌త్తుకు బాట‌లు వేద్దామన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+