ఓటాన్ అకౌంట్ బడ్జెట్: అసెంబ్లీ వద్ద భద్రత (ఫోటోలు)
హైదరాబాద్: ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సోమవారం శాసన సభలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెట్టారు. శాసన సభలో ఆర్థిక శాఖ మంత్రి ఆనం, శాసన మండలిలో దేవాదాయ శాఖ మంత్రి రామచంద్రయ్యలు ప్రవేశ పెట్టారు. కాగా అనంతరం ఉభయ సభలు బుధవారానికి వాయిదా పడ్డాయి.
2014-2015 వార్షిక బడ్జెట్ - 1,83,129 కోట్లు
ప్రణాళికేతర వ్యయం - 1,15,179 కోట్లు
ప్రణాళిక వ్యయం - 67,950 కోట్లు
ద్రవ్యలోటు అంచనా - 25,402 కోట్లు
రెవెన్యూ నిధుల అంచనా - 474 కోట్లు
సవరించిన బడ్జెట్ అంచనాలో రెవెన్యూ మిగులు - 1,023 కోట్లు
సవరించిన బడ్జెట్ అంచనాలో ద్రవ్యలోటు - 24,487 కోట్లు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 20,436 ఉద్యోగాలు మంజూరు చేశారు. 98,652 ఖాళీలు భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది.

అసెంబ్లీ
సోమవారం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని అసెంబ్లీ ప్రాంగణంలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

అసెంబ్లీ
ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సోమవారం ఉదయం శాసన సభలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. ఈ నేపథ్యంలో భారీ బందోబస్తు.

అసెంబ్లీ
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సభలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెట్టారు. అసెంబ్లీ బయట, లోపల భారీ భద్రత ఏర్పాటు చేశారు.

అసెంబ్లీ
సోమవారం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి ముందు అసెంబ్లీ లోపల, బయట గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అశ్వరూడులై వెళ్తున్న పోలీసులు.

ఆనం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బిల్లు ప్రవేశ పెడుతున్న దృశ్యం. పక్కన మంత్రులు గీతా రెడ్డి, రఘువీరా రెడ్డిలు.

కిరణ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో సోమవారం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెట్టారు. అంతకుముందు సభలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తెలంగాణ మంత్రులు.












Click it and Unblock the Notifications