శిల్పామోహన్ రెడ్డి హ్యాపీ, బాబు నిర్ణయానికి ఓకే చెప్పిన అఖిలప్రియ?

Posted By:
Subscribe to Oneindia Telugu

నంద్యాల: నంద్యాల ఉప ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థి ఎంపిక విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్ణయాన్ని స్వాగతించనున్నట్టు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిల ప్రియ చెప్పారు.అఖిలప్రియ స్టేట్ మెంట్ శిల్పా వర్గీయుల్లో ఆనందానికి కారణమైంది.

అమెరికా పర్యటన తర్వాత నంద్యాల అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసే అభ్యర్థిని ఎంపిక చేయనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే శిల్పా కుటుంబం, భూమా కుటుంబం ఈ స్థానం నుండి పోటీ చేసేందుకు ఆసక్తిని చూపుతున్నాయి.

అయితే అదే తరుణంలో ఈ రెండు వర్గాలను సమన్వయం చేయడంతో పాటు పార్టీకి నష్టం కల్గించకుండా ఉండేందుకుగాను రాజీ ఫార్మూలాను అనుసరించాలని టిడిపి నాయకత్వం భావిస్తోంది.ఈ మేరకు ఇరువర్గాలకు ఆమోదయోగ్యమైన ఫార్మూలాను అనుసరించేందుకుగాను చంద్రబాబునాయుడు ప్రయత్నాలను ప్రారంభించారు.

పార్టీకి నష్టం వాటిల్లకుండా ఉండేందుకుగాను టిడిపి నాయకత్వం జాగ్రత్తలను తీసుకొంటోంది. అయితే అభ్యర్థి ఎంపిక విషయంలో పార్టీ నాయకత్వం ఆచితూచి వ్యవహారిస్తోంది. అయితే పార్టీ టిక్కెట్టు దక్కకపోతే పార్టీ మారుతారనే గతంలో శిల్పా మోహన్ రెడ్డి విషయంలో ప్రచారం సాగింది.అయితే ప్రస్తుతం ఆయన కూడ కాస్త మెత్తబడినట్టు కన్పిస్తున్నారు.

అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయమే

అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయమే

కర్నూల్ జిల్లా నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా ఎవరిని బరిలో దింపుతారనే చర్చ రాజకీయవర్గాల్లో ఆసక్తిని నెలకొల్పుతోంది.ఈ స్థానం నుండి శిల్పా మోహన్ రెడ్డి పోటీ చేసేందుకు రంగం సిద్దం చేసుకోవడం వల్ల టిడిపి నాయకత్వానికి తలనొప్పులు వచ్చిపడ్డాయి. అయితే భూమా శోభానాగిరెడ్డి వర్థంతి రోజున తమ కుటుంబం నుండి ఎవరిని బరిలోకి దింపే విషయాన్ని ప్రకటిస్తామని మంత్రి అఖిలప్రియ గతంలో ప్రకటించారు.

అయితే పార్టీ సూచనమేరకు ఆమె అభ్యర్థిని ప్రకటించలేదు.అయితే ఎవరికి వారు అభ్యర్థి ఎంపికలో తమకు న్యాయం జరిగేలా పార్టీ నాయకత్వంపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. అయితే ఇరువర్గాలకు న్యాయం జరిగేలా నిర్ణయం తీసుకొంటామని పార్టీ నాయకత్వం చెప్పడంతో ఈ రెండువర్గాలు కూడ కాస్త వెనక్కు తగ్గాయి.

సర్వే ఆధారంగానే అభ్యర్థి ఎంపిక

సర్వే ఆధారంగానే అభ్యర్థి ఎంపిక

కర్నూల్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో ఎవరిని బరిలోకి దింపితే ప్రయోజనంగా ఉంటుందనే విషయమై టిడిపి నాయకత్వం సర్వే నిర్వహిస్తోంది. శిల్పా మోహన్ రెడ్డి పట్ల జనం ఏ రకంగా అభిప్రాయపడుతున్నారు.

భూమా కుటుంబంలో ఎవరు ఈ స్థానం నుండి పోటీ చేస్తే పార్టీకి ప్రయోజనం ఉంటుందనే విషయాలపై సర్వే నిర్వహిస్తోంది పార్టీ. ఈ సర్వే ఆధారంగా అభ్యర్థిని బరిలో దింపాలని పార్టీ నాయకత్వం తలపెట్టింది. ఇదే సూత్రాన్ని అమలు చేయనుంది.ప్రస్తుతం సర్వే పనులు సాగుతున్నాయి.ఈ సర్వే ఆధారంగానే అభ్యర్థిని ఎంపిక చేయాలని బాబు నిర్ణయించారు.అయితే సర్వే ఆధారంగా అభ్యర్థిని ఎంపిక చేయనున్నారు.అభ్యర్థి ఎంపిక విషయంలో బాబు నిర్ణయాన్ని స్వాగతిస్తామని భూమా అఖిలప్రియ చెప్పడంతో శిల్పా వర్గీయుల్లో హార్షాతిరేకాలు వ్యక్తమౌతున్నాయి.

భూమా కుటుంబం నుండి బ్రహ్మానందరెడ్డి

భూమా కుటుంబం నుండి బ్రహ్మానందరెడ్డి

నంద్యాల అసెంబ్లీ స్థానం నుండి భూమా బ్రహ్మానందరెడ్డి బరిలోకిదిగే అవకాశం ఉంది. భూమా నాగిరెడ్డి సోదరుడు వీరశేఖర్ రెడ్డి కొడుకే బ్రహ్మానందరెడ్డి. భూమా నాగిరెడ్డి మరణంతో నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో భూమా వర్గీయులు చెల్లాచెదురుకాకుండా ఉండేందుకుగాను ఆయన ప్రయత్నాలను ప్రారంభించారు.

నాగిరెడ్డి మరణంతో పెద్ద దిక్కును కోల్పోయామే బాధ ఆయన వర్గీయుల్లో ఉంది.అయితే ఈ నేపథ్యంలోనే భూమా వర్గీయులకు తాను అండగా ఉంటానని బ్రహ్మానందరెడ్డి భరోసా కల్పించే ప్రయత్నాలను ప్రారంభించారు. నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటిస్తూ ధైర్యం చెబుతున్నారు.అయితే అదే సమయంలో భూమా బ్రహ్మానందరెడ్డి నంద్యాలలో పర్యటించడం శిల్పా వర్గీయులకు రాజకీయంగా కొంత ఇబ్బందే.

నంద్యాలలో ఎవరిది పై చేయి?

నంద్యాలలో ఎవరిది పై చేయి?

నంద్యాలలో భూమా,శిల్పా కుటుంబాల్లో ఎవరు పై చేయి సాధిస్తారనే విషయంలో ఆసక్తి నెలకొంది. భూమా నాగిరెడ్డి, ఆయన సతీమణి రాజకీయాల్లో కీలకముద్ర వేశారు. వారిద్దరూ కూడ చనిపోయారు. ఈ కుటుంబానికి బంధువుగా ఉన్న ఎస్వీ మోహన్ రెడ్డి ప్రస్తుతం కర్నూల్ అసెంబ్లీ స్థానం నుండి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు.అదే సమయంలో రాజకీయాలకు భూమా అఖిలప్రియ కొత్త.ఆమె రాజకీయరంగ ప్రవేశం చేసి మూడేళ్ళు. శోభానాగిరెడ్డి మరణం తర్వాత ఆమె రాజకీయాల్లోకి వచ్చారు. మరో వైపు శిల్పామోహన్ రెడ్డి నంద్యాల అసెంబ్లీ స్థానం నుండి మూడు దఫాలు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మంత్రిగా కూడ పనిచేశారు. ఆయన సోదరుడు ఇటీవలనే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించారు. రాజకీయాల్లో అనుభవం ఎక్కువగా ఉన్న శిల్పా కుటుంబం, మరో వైపు రాజకీయాల్లో ఇప్పుడిప్పుడే రాణిస్తున్న మంత్రి అఖిలప్రియ మరో వైపు ఉన్నారు.అయితే అఖిలప్రియకు భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి పేర్లు రాజకీయంగా కలిసివచ్చే అవకాశాలున్నాయి.ఇదొక్కటే సరిపోదు ప్రత్యర్థుల ఎత్తును చిత్తు చేయడం కూడ తెలిసిఉండాలి. కొన్ని సమయాల్లో రాజకీయంగా అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. కొన్ని సమయాల్లో దూకుడును ప్రదర్శించాలి. మరికొన్ని సమయాల్లో చాలా శాంతిమంత్రాన్ని పాటించాలి. అయితే నంద్యాల సీటు విషయంలో ఎవరు పై చేయి సాధిస్తారనేది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
we will welcomig Andhrapradesh chiefminister Chandrababu naidu decission on Nadyala assembly candidate selection said Tourism minister Akhilapriya.Silpa Mohan reddy , Bhuma family preparing fro contest in Nandyala by poll.
Please Wait while comments are loading...