వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బలాలు, బలహీనతలు: ఏపీతో ప్రపంచ ఆర్థిక వేదిక ఒప్పందం, ఇదే తొలిసారి

By Srinivas
|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: ఏపీ పోటీ సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) సహకరించనుంది. ఈ మేరకు డబ్ల్యూఈఎఫ్‌, ఏపీ మధ్య బుధవారం అవగాహన ఒప్పందం కుదిరింది. సాధారణంగా డబ్ల్యూఈఎఫ్‌ వివిధ దేశాలతోనే ఇలాంటి ఒప్పందం కుదుర్చుకుంటుంది.

ఒక రాష్ట్రంతో ఒప్పందం కుదుర్చుకోవడం మాత్రం ఇదే తొలిసారి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాజ్ ప్యాలెస్‌లో జరిగిన సదస్సులో ప్రపంచ ఆర్థిక వేదిక ప్రతినిధులతో విస్తృత స్థాయి చర్చలు జరిపారు.

పోటీ సామర్థ్యం అంచనాకు కుదిరిన ఒప్పందంపై సీఎం చంద్రబాబు సమక్షంలో డబ్ల్యూఈఎఫ్‌ నిర్వహణ మండలి సభ్యుడు, ప్రాంతీయ వ్యూహాల కేంద్రం అధిపతి ఫిలిప్‌ రోజ్లర్‌, ఏపీ ప్రత్యేక కార్యదర్శి సంజయ్‌గుప్తా సంతకాలు చేశారు. ఈ ఒప్పందం కింద ఆంధప్రదేశ్‌ ప్రభుత్వం, దాని భాగస్వాముల పోటీ సామర్థ్యానికి సంబంధించి విజ్ఞాన పంపిణీ, సాంకేతిక సహకార కార్యక్రమాన్ని డబ్ల్యూఈఎఫ్‌ నిర్వహిస్తుంది.

ఆంధప్రదేశ్‌ తన లక్ష్యాలను సాధించేందుకు అవరోధాలను గుర్తించడం, వాటి స్థాయిని నిర్ధారించడం ముఖ్యమని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు అన్నారు. 12 అంశాల పనితీరు ఆధారంగా ఈ మదింపు ఉంటుంది.

ఈ 12 అంశాలు... సంస్థలు, మౌలిక సదుపాయాలు, స్థూల ఆర్థిక సుస్థిరత, ఆరోగ్యం-ప్రాథమిక విద్య, ఉన్నత విద్య-శిక్షణ, సరకు మార్కెట్‌ సామర్థ్యం, కార్మిక మార్కెట్‌ సామర్థ్యం, ఆర్థిక రంగ అభివృద్ధి, సాంకేతిక పరిజ్ఞాన సంసిద్ధత, మార్కెట్‌ పరిమాణం, వ్యాపార సరళీకరణ, నవ్య ఆలోచన పథం.

రాజదాని నిర్మాణానికి సహకరిస్తాం: విశ్రాంత పోలీసు అధికారుల సంఘం

రాజధాని నిర్మాణ కార్యక్రమాలకు తమ వంతు సహకారం అందిస్తామని విశ్రాంత పోలీసు అధికారుల సంఘం అధ్యక్షులు పృథ్వీ నారాయణ బుధవారం గుంటూరు జిల్లాలో తెలిపారు. జిల్లా పోలీస్ యంత్రాంగం, ప్రజలకు వారధిగా పని చేస్తామన్నారు.

English summary
Andhra Pradesh today signed a pact with World Economic Forum under which the Geneva-based organisation will help the state assess its competitiveness.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X