చంద్రబాబు ప్రభుత్వానికి రెండు లక్షల దెబ్బ, రీల్ రివర్స్
ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా లిక్కర్ షాపుల లైసెన్సుల కోసం భారీ సంఖ్యలో పోటీ ఉంటుందని ఊహించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఊహించని షాక్ తగిలింది. లిక్కర్ షాపుల లైసెన్స్ ల కోసం లక్షకు పైగా దరఖాస్తులు వస్తాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేసింది. ఒక్కో షాపు లైసెన్స్ కోసం ఒక అర్జీ సమర్పించడానికి రెండు లక్షల రూపాయలు డిపాజిట్ చెయ్యాల్సి ఉంది.
లిక్కర్ షాపు లైసెన్స్ ల కోసం దరఖాస్తులు సమర్పించే వారు ముందుగా డిపాజిట్ రుసుము రూ 2 లక్షలు చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆ రెండు లక్షల రూపాయలు తిరిగి ఇవ్వమని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ సందర్భంగా లిక్కర్ షాప్ లైసెన్సుల కోసం అర్జీలు సమర్పించే వారి సంఖ్య తగ్గిపోయింది. పలు ప్రాంతాల్లో అధికార పార్టీ నాయకులు లిక్కర్ షాప్ ల లైసెన్స్ ల కోసం పోటీ పడుతున్నారు.

అధికార పార్టీ నాయకులు లిక్కర్ షాప్ లైసెన్స్ దక్కించుకోవడానికి చాలామంది పోటీ పోతున్నారని సమాచారం. లిక్కర్ షాపులు లైసెన్సులు దక్కించుకోవడానికి దరఖాస్తులు సమర్పించుకోవడానికి ఇదే నెల 9వ తేదీ చివరి తేది. ఇలాంటి సమయంలో లిక్కర్ షాప్ లైసెన్స్ ల కోసం అర్జీలు సమర్పించే వారి సంఖ్య బాగా తగ్గిపోయింది. లిక్కర్ షాప్ లైసెన్స్ కోసం ఈనెల 9వ తేదీన ఆన్ లైన్, ఆఫ్ లైన్ లోనే కాకుండా ముందుగానే అర్జీలు సమర్పించుకోవాలని ఎక్సైజ్ శాఖ అధికారులు మనవి చేస్తున్నారు.
ఈనెల 7వ తేదీ, 8వ తేదీ లోనే లిక్కర్ షాపుల కోసం దరఖాస్తు చేసుకోవాలని ఎక్సైజ్ శాఖ అధికారులు మధ్యం వ్యాపారులకు సూచించారు. లిక్కర్ షాపుల లైసెన్స్ ల కోసం సుమారు లక్ష దరఖాస్తులు వస్తాయని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రూ.2,000 కోట్ల ఆదాయం వస్తుందని కూటమి ప్రభుత్వం అంచనా వేసింది. అయితే ఆదివారం వరకు లిక్కర్ షాపు లైసెన్స్ ల కోసం అర్జీలు సమర్పించిన వారి సంఖ్య 9 వేలు కూడా దాటకపోవడంతో అధికారులు షాక్ అయ్యారు

రెండు లక్షల రూపాయలు తిరిగి ఇస్తామని ప్రభుత్వం చెప్పి ఉంటే లిక్కర్ షాపుల లైసెన్సుల కోసం అర్జీలు సమర్పించే వారి సంఖ్య ఎక్కువగా ఉండేది. అధికార పార్టీల నాయకుల అనుచరులే లిక్కర్ షాప్ లైసెన్సుల కోసం ఎక్కువగా పోటీ పడుతున్నారని తెలిసింది. ఒకవేళ వైసీపీ నాయకులు లిక్కర్ షాపుల లైసెన్స్ ల కోసం పోటీ పడితే గతంలో మాకు ఎలాంటి చేదుఅనుభవాలు ఎదురైనాయో ఇప్పుడు వాళ్లకు కూడా అలాంటిది అనుభవాలు ఎదురవుతాయని కూటమి ప్రభుత్వం నాయకులు అంటున్నారు. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ షాపుల లైసెన్సుల కోసం పోటీ ఎక్కువగా లేదని తేలుస్తోంది.












Click it and Unblock the Notifications