వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సంక్రాంతి పండుగ ఎప్పుడు? జనవరి 14నా.. 15నా? గందరగోళం.. క్లారిటీ ఇదే!!

|
Google Oneindia TeluguNews

Makar Sankranti 2023 : తెలుగు వాళ్ళు అత్యంత ఘనంగా జరుపుకునే పండుగ సంక్రాంతి పండుగ. అచ్చనైన తెలుగుదనానికి ప్రతీకగా నిలిచే పండుగ సంక్రాంతి. సంక్రాంతి పండగ అనగానే మనకందరికీ గుర్తొచ్చేవి ముత్యాల ముగ్గులు, ముంగిట గొబ్బిళ్లు, హరిదాసుల పాటలు, బసవన్నల ఆటలు, ప్రతి ఇంట్లోనూ చేసే పిండి వంటలు, సందడి చేసే బంధువులు. అటువంటి సంక్రాంతి పండుగ దగ్గరకు వస్తున్న సమయంలో పండుగ ఎప్పుడు చేసుకోవాలి అన్నదానిపై అందరిలోనూ కన్ఫ్యూజన్ మొదలైంది.

మకర సంక్రాంతి పండుగ ఎప్పుడు .. 14నా.. 15నా?

మకర సంక్రాంతి పండుగ ఎప్పుడు .. 14నా.. 15నా?


మకర సంక్రాంతి పండుగ 14 వ తారీకు జరుపుకోవాలా? లేక 15వ తారీకు జరుపుకోవాలా అన్న సందిగ్ధం ప్రతి ఒక్కరి లోనూ కనిపిస్తుంది. తెలుగు రాష్ట్రాల ప్రజలు జరుపుకునే పండుగలలో అతి పెద్ద పండుగ అయిన సంక్రాంతి పండుగను ఎప్పుడు జరుపుకోవాలి అన్న దానిపైన అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే పుణ్యకాలం సంక్రాంతి పర్వదినంగా మనం భావిస్తాం అయితే సూర్యుడు మకర రాశిలో సంచరించే రోజున సంక్రాంతి పండుగ జరుపుకునే క్రమంలో జనవరి 14 వ తేదీ శనివారం రాత్రి 8 గంటల 45 నిమిషాలకు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అప్పుడే మకరసంక్రాంతి ముహూర్తం వస్తుంది.

ఉదయం ఉన్న తిథినే ప్రామాణికం, పండుగ అప్పుడే

ఉదయం ఉన్న తిథినే ప్రామాణికం, పండుగ అప్పుడే

కానీ రాత్రి సమయంలో సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పటికీ చాలా మంది ఉదయం ఉన్న తిథిని ప్రామాణికంగా తీసుకుంటారు కాబట్టి 14వ తేదీన కాకుండా 15వ తేదీన ఉదయం మకర సంక్రాంతి పర్వదినం గా భావించి జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు. సాధారణంగా చాలామంది మకర సంక్రాంతి సమయంలో స్నానాలు, దానాలు చేసి ఉత్తరాయణ పుణ్యకాలాన్ని ఆహ్వానిస్తారు. అయితే రాత్రి సమయంలో స్నానాలు, దానాలు చెయ్యకూడదు కాబట్టి 15వ తేదీనే మకర సంక్రాంతిగా జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు.

సంక్రాంతి నాడు ఉదయాన్నే ఈ పనులు చెయ్యండి

సంక్రాంతి నాడు ఉదయాన్నే ఈ పనులు చెయ్యండి


ఇక 15వ తేదీన మకర సంక్రాంతిని ఉదయం 7 గంటల 15 నిమిషాల నుండి సాయంత్రం 5 గంటల 46 నిమిషాల వరకు జరుపుకోవాలని సూచిస్తున్నారు. ఈరోజు ఉదయం 7 గంటల 15 నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకూ శుభ ముహూర్తం ఉంటుంది కాబట్టి ఈ సమయంలో సంక్రాంతి స్నానాలు, దానాలు చేస్తే మంచి జరుగుతుందని పండితులు సూచిస్తున్నారు. మకర సంక్రాంతి పుణ్యకాలంలో సూర్యభగవానుడు దక్షిణాయణం నుంచి ఉత్తరాయణ పుణ్యకాలానికి ప్రయాణం చేస్తాడు. ఇక ఉత్తరాయణ పుణ్యకాలంలో ఉన్నప్పుడు పగటి సమయం క్రమంగా పెరుగుతుంది. చలి కూడా తగ్గుముఖం పట్టి ఉష్ణోగ్రతలు పెరుగుతాయి.

సూర్యుడిని ప్రత్యేకంగా పూజించే రోజు సంక్రాంతి సంబరాలు

సూర్యుడిని ప్రత్యేకంగా పూజించే రోజు సంక్రాంతి సంబరాలు

మకర సంక్రాంతి పర్వదినాన అందరూ తలంటు స్నానాలు చేసి, కొత్త బట్టలు ధరించి, కొత్తగా పండిన బియ్యంతో నైవేద్యం తయారు చేసే సూర్యభగవానుడికి నివేదించి ప్రత్యేకంగా సూర్యుడిని పూజిస్తారు. సూర్యుని పూజించే శుభదినం కాబట్టి, సూర్య దర్శనం మనకు పగలే లభిస్తుంది కాబట్టి మకర సంక్రాంతి పర్వదినాన్ని 14వ తేదీ రాత్రి కాకుండా, 15వ తేదీ ఉదయం నుండి చేసుకోవడం మంచిదని పండితులు చెబుతున్నారు. ఇందులో ఇంకా ఎలాంటి సందేహాలకు తావు లేదని క్లారిటీ ఇస్తున్నారు. పండితుల సలహా మేరకు జనవరి 15 మకర సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుని సంబరాలు చేసుకోండి.

English summary
There is a confusion about when to celebrate Sankranti this year. Telugu states people are discussing whether to celebrate on January 14th or 15th. But pandits say that Sankranti should be celebrated on January 15.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X