Pawan Kalyan : ఏది వీరమరణం ? పవన్ డైలాగ్ పై ఆసక్తికర చర్చ ! తెరపైకి కొత్త ప్రశ్నలు !
ఏపీలో వచ్చే ఎన్నికలకు రంగం సిద్దమవుతున్న వేళ పొత్తుల వ్యవహారం కూడా అంతే కీలకంగా మారిపోతోంది. వైసీపీకి వ్యతిరేకంగా విపక్షాలను కూడగట్టే పనిలో ఉన్న జనసేనాని పవన్ కళ్యాణ్.. తాజాగా శ్రీకాకుళం జిల్లా రణస్ధలంలో జరిగిన యువశక్తి సభలో పొత్తులకు సంబంధించి పలు వ్యాఖ్యలు చేశారు. ఇందులో ప్రధానంగా ఆయన వీరమరణం అనే పదాన్ని వాడారు. దీంతో ఈ వీరమరణం ఎవరికి, ఎందుకు, ఎలా అనే చర్చ రాష్ట్రంలోని రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ఎన్నికల ప్రక్రియలో సర్వసాధారణమైన పొత్తులపై ప్రశ్నలు లేవనెత్తేలా ఉన్న ఈ వీరమరణం వ్యాఖ్యపై జనం కూడా చర్చించుకుంటున్నారు.

పవన్ వీరమరణం డైలాగ్
నిన్న శ్రీకాకుళం జిల్లా రణస్ధలంలో జరిగిన జనసేన యువశక్తి సభలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పొత్తుల గురించి ప్రస్తావించే క్రమంలో వీరమరణం అనే పదాన్ని వాడారు. సాధారణంగా సరిహద్దుల్లో శత్రువులతోనే, లేదా సమాజంలో అసాంఘిక శక్తులతోనో పోరాడే క్రమంలో సైనికులు లేదా పోలీసులు చనిపోతే దాన్ని వీరమరణంగా ప్రస్తావిస్తుంటారు. అలా వీరమరణం పొందిన వారికి కూడా తగిన గుర్తింపు, గౌరవం కూడా లభిస్తుంది. ప్రభుత్వాలతో పాటు ప్రజలు కూడా అలాంటి వీరుల్ని కలకాలం గుండెల్లో పెట్టుకుంటారు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ వీరమరణం డైలాగ్ తో ఏం చెప్పదల్చుకున్నారనే చర్చ రాష్ట్రంలో జరుగుతోంది.

ఒంటరిగా వెళ్లే వీరమరణమే.. ?
రాష్ట్రంలో వచ్చే ఎన్నికలకు పొత్తుల్లేకుండా వెళ్లి వీరమరణం పొందాల్సిన అవసరం లేదంటూ పవన్ కళ్యాణ్ జనసేన శ్రేణుల్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తద్వారా పొత్తులతోనే ముందుకెళ్లబోతున్నట్లు తేల్చిచెప్పేశారు. అలాగే పొత్తుల్లేకుండా వెళితే గెలుస్తామన్న ధీమా మీరు ఇవ్వగలరా అంటూ వారిని సూటిగా అడిగారు. మీరు ఆ ధీమా ఇవ్వగలిగితే పొత్తుల్లేకుండా ఒంటరి పోరు చేసి వీరమరణం పొందేందుకు కూడా రెడీ అన్న సంకేతాలు ఇచ్చేశారు. అదే సమయంలో పొత్తులు ఉన్నప్పటికీ గౌరవప్రదంగానే ఉండాలంటూ అటు చంద్రబాబుకూ హింట్ ఇచ్చారు.

పవన్ ఉద్దేశమేంటి ?
రాష్ట్రంలో పొత్తుల్లేకుండా వెళ్లడం ద్వారా వీరమరణం పొందాల్సిన అవసరం లేదంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు గమనిస్తే చాలా విషయాలు అర్ధమవుతాయి. ప్రస్తుత పరిస్ధితుల్లో ఒంటరిగా పోటీ చేసి గెలిచే పరిస్ధితి లేదని పవన్ కళ్యాణ్ తేల్చిచెప్పేశారు. అలాగే ఒంటరిగా వెళ్తే వీరమరణం తప్పదనే సంకేతాన్నీ ఆయన ఇచ్చేశారు. ఒంటరి పోరుతో నష్టం తప్ప ఎలాంటి లాభం లేదని గత ఎన్నికలు నిరూపించిన విషయాన్ని కూడా పవన్ మరోసారి గుర్తుచేశారు. ఒంటరి పోరు కారణంగా తమతో పాటు విపక్షంలో మిత్రపక్షాలు కూడా నష్టపోవడం ఖాయమన్న విషయాన్ని పవన్ లెక్కలతో సహా చెప్పేశారు. దీంతో పవన్ ఒక్క ఒంటరి పోరు డైలాగ్ తో చాలా విషయాలు చెప్పినట్లయింది.

పవన్ కు ధీమా ఇవ్వలేని జనసేన ?
రాష్ట్రంలో పొత్తుల్లేకుండా ఒంటరిగా వెళ్తే నష్టపోవడం ఖాయమని, వీరమరణం తప్పదని పవన్ భావిస్తున్నారు. అయితే బలం సరిపోతుందని అనుకుంటే ఒంటరిగానే పోటీ చేస్తామని, ఆ ధీమా మీరు ఇస్తారా అంటూ జనసేన నేతల్ని ఉద్దేశించి పవన్ అడిగిన ప్రశ్న కూడా ఇక్కడ పలు అనుమానాలు రేకెత్తించేలా ఉంది. ఎందుకంటే జనసేనకు ఒంటరిగా పోటీ చేసి గెలిచే బలమే ఉంటే పొత్తుల అవసరం ఎలాగో లేదు. అలాగే సొంత పార్టీ జనసేన నేతలు పవన్ కు ఆ ధీమా ఇవ్వలేకపోతున్నారనేదే ఆయన ఆవేదనగా కనిపిస్తోంది. దీంతో పవన్ కళ్యాణ్ సొంత పార్టీ నేతల్ని నమ్ముకుని గత ఎన్నికల తరహాలో ఒంటరిపోరుకు వెళ్లడం సరికాదని పొత్తులవైపు మొగ్గినట్లు అర్ధమవుతోంది.
-
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..












Click it and Unblock the Notifications