రౌడీయిజం చేస్తే రాష్ట్ర బహిష్కరణే: వారికి చంద్రబాబు వార్నింగ్

రాష్ట్రంలో శాంతిభద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని కొందరు రాజకీయ ముసుగులో ఉండే రాజకీయం రౌడీయిజం చేస్తామంటే కుదరదని, అలాంటివారిని రాష్ట్ర బహిష్కరణ చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు సెటిల్మెంట్లు, బెదిరింపులకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తిరుపతిలో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన నూతన జిల్లా పోలీసు కార్యాలయాన్ని హోం మంత్రి అనితతో కలిసి ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం అక్కడే ఉన్న విజిటర్స్ పుస్తకంలో సీఎం తన అభిప్రాయాలను, సూచనలను రాశారు.

పోలీసులు టెక్నాలజీ వాడాలన్న సీఎం చంద్రబాబు
ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం చంద్రబాబు టెక్నాలజీని వాడుకుని నేర నియంత్రణ చేయాలని, డ్రోన్ల ద్వారా పెట్రోలింగ్ నిర్వహించి విజువల్ ఆధారాలను సేకరించాలని సూచించారు. నేరస్తుల కంటే పోలీసులు ఎక్కువ ఆలోచించగలగాలని, వారెన్ని డ్రామాలు ఆడినా టెక్నాలజీ సాయంతో పట్టుకోవాలని స్పష్టం చేశారు. ఈ విషయంలో విజిబుల్ పోలీసింగ్ ఇన్విజిబుల్ పోలీస్ అనే విధానాన్ని అనుసరించాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.

who engage in rowdyism they will be banished from the state Chandrababu warning to them

వైకుంఠ ఏకాదశికి పోలీస్ వ్యవస్థ అప్రమత్తంగా ఉండాలి
కలియుగ వైకుంఠమైన శ్రీవేంకటేశ్వరస్వామి నెలకొని ఉన్న ఈ ప్రాంత పవిత్రతను కాపాడేలా పోలీసులు చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని పోలీసు వ్యవస్థ అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. భక్తులకు ఎక్కడా చిన్న అసౌకర్యం కలగకుండా, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్త వహించాలని సూచించారు.

రౌడీయిజంపై మండిపడిన సీఎం చంద్రబాబు
తిరుమల పవిత్రతను కాపాడుతూ, భక్తులకు పూర్తి రక్షణ కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులకు భద్రతా భావం కల్పించే బాధ్యత పోలీసులదేనని సీఎం అన్నారు. ఇదే సమయంలో రాష్ట్రంలో రౌడీయిజంపైన మండిపడిన చంద్రబాబు రౌడీయిజం చేసేవారిని రాష్ట్ర బహిష్కరణ చేస్తామని హెచ్చరించారు. అక్రమాలకు పాల్పడితే సొంత పార్టీ వారైనా సరే జైలుకు పంపిన చరిత్ర తమదని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.

గత ప్రభుత్వ హయాంలో తిరుమల పవిత్రత దెబ్బ తీశారు
గత ప్రభుత్వ హయాంలో శాంతిభద్రతలు పూర్తిగా భ్రష్టు పట్టాయని, తిరుమల పవిత్రతను దెబ్బతీశారని చంద్రబాబు విమర్శించారు. రోడ్లు బ్లాక్ చేయటం, రప్పా రప్పా లాడించటం ఏమిటో ఎవరికీ ఆర్ధం కావటం లేదన్నారు. బంగారు పాళ్యంలో మామిడి కాయలు తొక్కించారు అన్నారు. గుంటూరులో ఓ వ్యక్తిని కాన్వాయ్ కింద తొక్కించి పొదల్లో పారేసి పోయారని అన్నారు. ఆ తర్వాత అంబులెన్సులో తీసుకెళ్లి చంపేశారని వారి బంధువులతో చెప్పించారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.

సీసీ కెమెరాలు, డ్రోన్ల ద్వారా ఆధారాలు పెట్టుకోవాలి
ఈ తరహా ఘటనల్లో సీసీ కెమెరాలు, డ్రోన్ల ద్వారా ఆధారాలు పెట్టుకోవాలన్నారు. రోడ్లు బ్లాక్ చేయడం, కత్తులతో జంతు బలులు ఇచ్చి పోస్టర్లపై రక్తం చల్లి సమాజాన్ని భయబ్రాంతులకు గురిచేసే సంస్కృతిని ఉపేక్షించబోమని సీఎం స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ, అసభ్య పోస్టులు పెట్టే వారిపై ప్రభుత్వం నిఘా ఉంచిందని సీఎం తెలిపారు.

రాజకీయ లబ్ధి కోసం ప్రభుత్వంపై కొందరు బురద చల్లే ప్రయత్నం
ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల్లో ఎవరూ ఇలాంటి చర్యలకు పాల్పడటం లేదని, కేవలం రాజకీయ లబ్ధి కోసం ప్రభుత్వంపై కొందరు బురద చల్లే ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఇక ఇదే సమయంలో తిరుపతిలో గంజాయి, డ్రగ్స్ నియంత్రణకు కృషి చేస్తున్న పోలీసులను సీఎం అభినందించారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ అరికట్టడంలోనూ, పీడీ యాక్టుల అమలులోనూ పోలీసులు చూపుతున్న చొరవను సీఎం చంద్రబాబు కొనియాడారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+