దేవినేని కుటుంబానికే విజయవాడ మేయర్ పీఠం?

రాష్ట్ర రాజకీయాలకు కేంద్ర బిందువైన విజయవాడ నగర మేయర్ పీఠం ఎవరికి దక్కనుందనే అంశంపై ప్రస్తుతం ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. నగర అభివృద్ధి, మిత్రపక్షాల పొత్తులు, సామాజిక సమీకరణాల నేపథ్యంలో మేయర్ అభ్యర్థిత్వంపై ప్రధాన పార్టీలో విస్తృతమైన మథనం జరుగుతోంది. ఈసారి మేయర్ ఎన్నికలను ప్రత్యక్ష పద్ధతిలోనే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఆశావహుల సంఖ్య భారీగా పెరిగింది. పలువురు కీలక నేతలు, వారి కుటుంబ సభ్యుల పేర్లు ఈ రేసులో ప్రముఖంగా వినిపిస్తుండటంతో నగర రాజకీయం మరింత వేడెక్కింది.

దేవినేని కుటుంబం భేటీతో ఊపందుకున్న ప్రచారం!

తాజాగా రాష్ట్ర మంత్రి నారా లోకేశ్‌తో దేవినేని కుటుంబ సభ్యులు మర్యాదపూర్వకంగా సమావేశమవ్వడం పొలిటికల్ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీకి సంబంధించిన వివరాలను, ఫొటోలను చందు దేవినేని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ "ఒక మర్యాదపూర్వక కలయిక... ఒక కొత్త ఆశ!" అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు జత చేశారు. దీంతో దేవినేని కుటుంబానికి మేయర్ పీఠం దక్కబోతోందా అనే ప్రచారం మళ్లీ తెరపైకి వచ్చింది. అయితే, ఇది కేవలం మర్యాదపూర్వక సమావేశమేనా లేక మేయర్ ఎంపికపై ఏమైనా చర్చలు జరిగాయా అనేది రాబోయే రోజుల్లో స్పష్టత రానుంది.

Who Will Be Next Vijayawada Mayor Devineni Family Bonda Uma Son And Vangaveeti Radha In Race

సిద్ధార్థ్ కోసం బోండా ఉమా వినతి!

మరోవైపు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ సైతం తన కుమారుడు సిద్ధార్థ్‌ను మేయర్ బరిలో నిలిపేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. సీఎం చంద్రబాబును కలిసి నగరంలో ఉన్న పట్టు, సామాజిక సమీకరణాలను వివరిస్తూ సిద్ధార్థ్‌కు అవకాశం ఇవ్వాలని కోరినట్లు సమాచారం. నగరంతో దశాబ్దాల అనుబంధం, పార్టీకి ఉన్న పటిష్టమైన యంత్రాంగం తమకు కలసివస్తుందని ఆయన భావిస్తున్నారు.

విజయవాడ మేయర్ రేసులో వంగవీటి Vs బోండా vs జనసేన - దక్కేదెవరికి, కొత్త లెక్కలు..!!
విజయవాడ మేయర్ రేసులో వంగవీటి Vs బోండా vs జనసేన - దక్కేదెవరికి, కొత్త లెక్కలు..!!

వంగవీటి రాధా పేరుపై కూడా ప్రచారం!

ఇదే సమయంలో వంగవీటి రాధాకృష్ణ పేరు కూడా పొలిటికల్ వర్గాల్లో విస్తృతంగా ప్రచారంలో ఉంది. 2019 నుంచి పార్టీకి అండగా నిలుస్తున్న ఆయనకు మేయర్ స్థానాన్ని కేటాయిస్తే నగర వ్యాప్తంగా అనుకూల వాతావరణం ఏర్పడుతుందని ఒక వర్గం భావిస్తోంది. అయితే, రాధా మాత్రం స్వయంగా ఈ విషయంలో ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం. వీటితో పాటు మిత్రపక్షాలైన జనసేన నేతలు కూడా విజయవాడ, మచిలీపట్నం మేయర్ సీట్లపై ఆశలు పెట్టుకోవడంతో పొత్తుల సమీకరణాలు కూడా కీలకంగా మారనున్నాయి.

విజయవాడ మేయర్ అభ్యర్దిగా వంగవీటి ఆశాలతా, అక్కడే అసలు ట్విస్ట్..!?
విజయవాడ మేయర్ అభ్యర్దిగా వంగవీటి ఆశాలతా, అక్కడే అసలు ట్విస్ట్..!?

అధినేత నిర్ణయమే ఆఖరిది: కేశినేని చిన్ని స్పష్టత!

విజయవాడ మేయర్ స్థానంపై ఉన్న పోటీ గురించి ఎంపీ కేశినేని చిన్ని స్పందిస్తూ.. తమ పార్టీ నుంచి దాదాపు 15 మందికి పైగా అభ్యర్థులు మేయర్ సీటు కోసం ఆశ పడుతున్నారని తెలిపారు. ఎమ్మెల్యే బోండా ఉమా తన కుమారుడికి అవకాశం కోరుతున్న విషయాన్ని గుర్తు చేస్తూ.. ఆఖరిగా ఎవరిని బరిలోకి దింపాలనేది ముఖ్యమంత్రి ఫైనల్ చేస్తారని స్పష్టం చేశారు. కార్పొరేషన్ ఎన్నికలు వాయిదా పడతాయన్న ప్రచారంలో నిజం లేదని ఆయన తేల్చిచెప్పారు. అంతిమంగా సర్వే నివేదికలు, క్షేత్రస్థాయి బలాబలాలను బట్టి పార్టీ అధిష్ఠానం తీసుకునే నిర్ణయమే ఫైనల్ కానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+