విజయవాడ మేయర్ రేసులో వంగవీటి Vs బోండా vs జనసేన - దక్కేదెవరికి, కొత్త లెక్కలు..!!

ఏపీలో స్థానిక ఎన్నికల వేడి మొదలైంది. కూటమి- వైసీపీ ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. కూటమిలో సీట్ల సర్దుబాటు వ్యవహారం కీలకంగా మారుతోంది. విజయవాడ కార్పోరేషన్ కోసం కూటమిలో పోటీ నెలకొంది. జనసేన చాలా రోజులుగా విజయవాడ పైన ఆశలు పెట్టుకుంది. ఇటు టీడీపీ వంగవీటి- బోండా నుంచి మేయర్ సీటు కోసం రేసు మొదలైంది. కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో.. అసలు ఈ సీటు ఏ పార్టీకి దక్కుతుంది.. ఎవరికి కేటాయిస్తారనేది ఆసక్తిని పెంచుతోంది.

మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్దం అవుతోంది. కూటమి.. వైసీపీ ఈ ఎన్నికల కోసం సమాయత్తం అవుతున్నాయి. మేయర్, మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికలు ప్రత్యక్ష పద్దతిలో నిర్వహించాలని ఇప్పటి కే ప్రభుత్వం నిర్ణయించింది. కూటమిలో సీట్ల సర్దుబాటు వ్యవహారం కీలకంగా మారుతోంది. కాగా, ప్రధానంగా విజయవాడ కార్పోరేషన్ పైన ఈ సారి జనసేన ఆశలు పెట్టుకుంది. విజయవాడలో జెండా ఎగురవేయాలని భావిస్తోంది. పార్టీ సమావేశాల్లోనూ ఇదే అంశాన్ని ముఖ్య నేతలు ప్రస్తావన చేసారు. కాగా.. ఇంకా సీట్ల సర్దుబాటు జరగలేదు. ఈ సమయంలోనే విజయవాడ మేయర్ సీటు కోసం టీడీపీ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ తన కుమారుడుతో సహా సీఎం చంద్రబాబును కలిసి చేసిన వినతి ఇప్పుడు చర్చగా మారుతోంది. తన కుమారుడు సిద్ధార్థ్ కు మేయర్ సీటు కోసం బోండా ఉమా ప్రయత్నాలు చేస్తున్నారు. నగరంలో ఉన్న పట్టు.. సమీకరణాలు కలిసి వస్తాయని బోండా ఉమా పార్టీకి వివరిస్తున్నారు.

టీడీపీ కుప్పం రివేంజ్, పులివెందుల 'అష్టదిగ్బంధనం'- జగన్ అభ్యర్ధి ఫిక్స్..బిగ్ ఫైట్.!!
టీడీపీ కుప్పం రివేంజ్, పులివెందుల 'అష్టదిగ్బంధనం'- జగన్ అభ్యర్ధి ఫిక్స్..బిగ్ ఫైట్.!!
vijayawada-mayor-seat-jana-sena-stakes-claim-bonda-uma-and-vangaveeti-radha-in-tdp-race

విజయవాడ సీటు దక్కేదెవరికి..?

ఇదే సమయంలో వంగవీటి రాధాకృష్ణ పేరు కూడా ప్రచారంలో ఉంది. 2019 లో వంగవీటి రాధ వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. ఆ సమయంలోనే రాధాకు ఎమ్మెల్సీ హామీ ఉంది. ఇప్పటి వరకు ఆ హామీ అమలు కాలేదు. అయితే.. రాధాకు విజయవాడ మేయర్ గా అవకాశం ఇస్తారని పార్టీలోనే పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. రాధా ఎక్కడా తాను మేయర్ బరిలో ఉన్నట్లు చెప్పటం లేదు. అదే సమయంలో జనసేన నేతలు మాత్రం విజయవాడ, మచిలీపట్నం సీట్ల కోసం పోటీలో నిలిచారు. తొలి నుంచి విజయవాడ నగరం టీడీపీకి గట్టి పట్టు ఉన్న ప్రాంతంగా ఉంది. తొలి సారి స్థానిక ఎన్నికల్లో పొత్తులతో వెళ్తున్న టీడీపీ మిత్రపక్షాలకు కేటాయించే సీట్ల వ్యవహారంలో ఆచి తూచి వ్యవహరిస్తోంది. అదే సమయంలో సర్వే నివేదికలు.. క్షేత్ర స్థాయి రిపోర్టులు కీలక కానున్నాయి. దీంతో.. విజయవాడ సీటు పొత్తుల్లో ఎవరికి దక్కుతుంది.. అసలు మేయర్ రేసులో ఎవరికి ఛాన్స్ వస్తుందనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+