హోల్ సేల్ షాప్ డీప్‌ఫ్రిజ్‌లో..కుళ్లిన కోళ్లు;ఎలుకల వీర విహారం..సీజ్
ప్రకాశం జిల్లా: ప్రకాశం జిల్లాలోని పొదిలి ప్రధాన రహదారి గుండా ప్రయాణిస్తున్నమాంస అభివృద్ధి కమిటీ ఛైర్మన్ ప్రకాష్ నాయుడు రోడ్డుపక్కన ఉన్నకెపి చికెన్ హోల్‌సేల్,రిటైల్ దుకాణాన్నిఆకస్మికంగా తనిఖీ చేశారు. దుకాణం వెనుక భాగంలో ఉన్న డీప్‌ఫ్రిజ్‌లో రోజుల తరబడి నిల్వఉంచి దుర్వాసనలు వెదజల్లుతున్న చచ్చిన కోళ్ళు, 100 కెజీల చికెన్‌ను...అందులో సంచారిస్తున్నఎలుకలను చూసి ఛైర్మన్ షాక్ తిన్నారు.
దుకాణంలో దారుణమైన పరిస్థితులపై ఆగ్రహించిన ఆయన వెంటనే షాపు యాజమానిపై కేసు నమోదు చేయించడంతో పాటురూ.20వేలు పెనాల్టీ విధించి చికెన్‌షాపును సీజ్ చేయాలని పంచాయతీ అధికారులకు ఆదేశించారు. సేకరించిన శాంపిల్స్‌ను ఫుడ్‌సెక్యూరిటీ విభాగానికి పంపించి అక్కడ నుండి విజయవాడ క్వాలిటీ టెస్టింగ్ ల్యాబ్‌కు పంపిస్తామని చెప్పారు.

ఈ దుకాణాల్లో పరిస్థితులను స్వయంగా పరిశీలించి తెలుసుకున్నఆయన అనంతరం పట్టణంలోని అన్ని చికెన్‌షాపులు మాంసహార దుకాణాలను తనిఖీ చేసి లైసెన్స్ లను పరిశీలించాలని, నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న దుకాణదారులపై చర్యలు తీసుకోవాలని పంచాయతీ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ప్రకాష్‌నాయుడు మాట్లాడుతూ ఇక్కడ పరిస్థితిపై జిల్లా అధికారులకు తెలియజేస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications