టీడీపీకి అసలు టెన్షన్ అక్కడే ? కానీ వాటినే వదిలేసి పొత్తులపై దృష్టి !

ఏపీలో వైసీపీకి వ్యతిరేకంగా విపక్షాలు జట్టు కడుతున్నాయి. ముఖ్యంగా విపక్షాల్ని కలిపేందుకు ఓవైపు పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తుంటే మరోవైపు చంద్రబాబు కూడా టీడీపీ-బీజేపీ పొత్తు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ పొత్తులన్నీ కుదిరినా ఓ విషయంలో మాత్రం టీడీపీకి ఇబ్బందులు తప్పేలా లేవు. వచ్చే ఎన్నికల కోసం అధికార పార్టీ అన్ని స్ధానాల్లో ఎమ్మెల్యేలు లేదా ఇన్ ఛార్జ్ ల నియామకంతో పటిష్టంగా కనిపిస్తుంటే టీడీపీ మాత్రం అక్కడే వెనకబడుతున్నట్లు కనిపిస్తోంది.

ఏపీలో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత టీడీపీ కొన్నాళ్ల పాటు మౌనంగా ఉండిపోయింది. ఆ తర్వాత క్రమంగా కోలుకుని పలు చోట్ల ఇన్ ఛార్జ్ లను నియమించింది. అయినా ఇప్పటికీ పలు అసెంబ్లీ సీట్లలో ఆ పార్టీకి ఇన్ ఛార్జ్ లు కనిపించడం లేదు. ఆయా చోట్ల వచ్చే ఎన్నికల్లో తమకే సీటు వస్తుందన్న ఆశలో పలువురు పోటీ పడుతున్నారు. వీరిలో ఎవరికి ఇన్ ఛార్జ్ పదవి ఇచ్చినా మిగిలిన వారు వ్యతిరేకంగా మారే ప్రమాదం ఉండటంతో టీడీపీలో డైలమా కనిపిస్తోంది.

cbn

గత ఎన్నికల తర్వాత టీడీపీలో ఇన్ ఛార్జ్ ల నియామకం సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాల్సి ఉన్నా.. అధినేత చంద్రబాబు మాత్రం నానాటికీ ఆలస్యం చేస్తూ వచ్చారు. దీని ఫలితం పార్టీ అవకాశాలపై పడుతోంది. పలు చోట్ల ఇన్ ఛార్జ్ లు లేకపోవడం, ఆఖరు నిమిషంలో తీసుకున్న నిర్ణయాలతో స్ధానిక సంస్ధల ఎన్నికల్లో పరాజయాలు చవిచూసిన టీడీపీ.. ఇప్పటికీ ఆయా చోట్ల నియామకాలు చేపట్టడం లేదు. దీనిపై ఆశావహుల్లో టెన్షన్ పెరుగుతోంది.

టీడీపీ ఇన్ ఛార్జ్ ల నియామకం ఇంకా పూర్తి కాని నియోజకవర్గాలు దాదాపు 25 వరకూ ఉంటాయని అంచనా. వీటిలో స్ధానిక నేతలతో పాటు బయటి నేతలు కూడా టికెట్ కోసం పోటీపడుతున్నారు. ఆయా చోట్ల టీడీపీ సమన్వయకమిటీలు, ఇతరత్రా కమిటీల నియామకంతో నెట్టుకొస్తోంది. కానీ ఇన్ ఛార్జ్ ల నియామకం మాత్రం చేపట్టలేకపోతోంది. మరోవైపు అధికార వైసీపీ మాత్రం ఆయా చోట్ల ఎమ్మెల్యేల బలంతో పాటు ఇంకొన్ని చోట్ల ఇన్ ఛార్జ్ లను నియమించి వారికి అన్ని అధికారాలు ఇచ్చి ప్రోత్సహిస్తోంది. ఇలాంటి సమయంలో జనసేన, బీజేపీతో పొత్తులు కుదిరితే పరిస్దితి మరింత క్లిష్టంగా మారుతుందన్న అంచనాలు ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+