చిరు ఎఫెక్ట్: బిజెపిలోకి దాసరి నారాయణరావు?

dasari narayana rao
హైదరాబాద్: ప్రముఖ దర్శక నిర్మాత దాసరి నారాయణ రావు బిజెపిలో చేరే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో కాంగ్రెసు ముఖ్య నేతగా గుర్తింపు పొంది కేంద్ర మంత్రి పదవిని కూడా చేపట్టిన ఆయన తదనంతర కాలంలో రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేసి చిరంజీవిని కేంద్ర మంత్రిగా తీసుకునే క్రమంలోనే దాసరి నారాయణ రావును కాంగ్రెసు పార్టీ దూరం చేసుకున్నట్లు తెలుస్తోంది.

చిరంజీవికి వ్యతిరేకంగా గత ఎన్నికల్లో మేస్త్రీ అనే సినిమా కూడా తీసి, కాంగ్రెసుకు ఎన్నికల్లో ఉపయోగపడేందుకు దాసరి నారాయణ రావు దోహదపడ్డారు. అయితే, తర్వాత ఆయన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. దానికితోడు బొగ్గు కుంభకోణం కేసులో ఆయన పేరు కూడా ముందుకు వచ్చింది. ఈ స్థితిలో ఆయన కాంగ్రెసు పార్టీతో పూర్తిగా విసిగిపోయినట్లు చెబుతున్నారు.

కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత ఆయన రాజకీయాల పట్ల వైరాగ్యం ప్రదర్శించారు. కానీ, ప్రస్తుత స్థితిలో దాసరి నారాయణరావును పార్టీలోకి తెచ్చేందుకు బిజెపి నాయకత్వం ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. కోస్తాంధ్రలో చిరంజీవికి దీటుగా దాసరి నారాయణ రావు పనికి వస్తారనే ఉద్దేశంతో ఆ పార్టీ ఉన్నట్లు చెబుతున్నారు.

రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెసు నాయకులు కొంత మంది వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల వైపు చూస్తున్నారు. అదే సమయంలో ఇటీవలి కాలంలో బిజెపిలో చేరడానికి చాలా మంది ఉత్సుకత ప్రదర్శిస్తున్నారు. బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ పారదర్శక పాలన, అభివృద్ధి మంత్రాలు వారిని అటువైపు లాగుతున్నట్లు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+