వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విపక్షాలపై చంద్రబాబు అస్త్రం...అఖిలపక్షం:మరి ఈసారైనా లక్ష్యం నెరవేరుతుందా?

|
Google Oneindia TeluguNews

ఆ అస్త్రం...ఈ అస్త్రం అనే తేడా లేకుండా ఎన్ని అస్త్రాలు సంధించినా ప్రతిపక్షాల ఎదురుదాడికి అవి చిత్తవుతుండటంతో ముఖ్యమంత్రి,టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పంతం అంతకంతకూ పెరిగిపోతోంది. చాలాకాలంగా తన వ్యూహాలన్నీ విఫలమవుతూ...ప్రత్యర్థులను దెబ్బతీయడమేమో కాని బూమరాంగ్ ల్లాగా తిరిగొచ్చి తమకే తీవ్రమైన నష్టాన్ని కలుగజేస్తుండటంతో చంద్రబాబు ఈసారి మరో అస్త్రాన్ని సంధించబోతున్నారు.

వాస్తవంగా ఇదీ ఇటీవలే ప్రయోగించిన అస్త్రమే...దీన్ని కూడా ఎంత ఫోర్స్ గా ప్రయోగించారో అంతే పోర్స్ గా తిరిగొచ్చి తలబొప్పికట్టించిన బాపతే...కాకపోతే ఈసారి దీన్ని మరింత పదునుబెట్టి...మరికాస్త మందుగుండు దట్టించి...మరికొంత శక్తిని జోడించి...బాగా గురి చూసి వదలాలని నిర్ణయించుకున్నారు. అంతేకాదు ఈ అస్త్రం విజయవంతమయ్యేందుకు తాను ఓ మెట్టు దిగి ప్రయోగించడానికి కూడా కూడా చంద్రబాబు సిద్దమయ్యారట...

 ఇంతకీ ఏమా అస్త్రం...ఏమా కథ

ఇంతకీ ఏమా అస్త్రం...ఏమా కథ

మరి ఈ అస్త్రం ఈసారైనా విజయవంతమవుతుందో లేదో నని ఆ పార్టీ వాళ్లే టెన్షన్ గా ఎదురుచూస్తున్నారట...ఇంతకీ ఆ అస్త్రం ఏమిటంటే...అఖిలపక్షం...
ఇదే ప్రతిపక్షాల మెడలు వంచాలనే లక్ష్యంతో చంద్రబాబు రెండోసారి వదులుతున్న పాశుపతాస్త్రం...మరి ఇది ఈసారైనా లక్ష్యాన్ని చేధిస్తుందో లేదో చూడాలి.
ఈ అస్త్రాన్ని తొలిసారి ప్రయోగించినప్పుడు చాలా దారుణంగా ఫెయిలైంది...ఇంకా చెప్పాలంటే...మొదట్లోనే తుస్సుమంది...మధ్యలో బుస్సుమన్నా ఆ కాటు కూడా తమకే పడింది. దాన్నే ప్రాక్టికల్ గా చెప్పాలంటే అసలు అఖిల పక్షానికి పిలిచేది ఇంతేనా?..అయినా నువ్వు పిలవంగానే మేము రావాలా అంటూ మూడు ప్రధాన పార్టీలు ఈసడించడగా...ఈ సమావేశానికి వచ్చిన పార్టీలు కూడా...ఆయన గతకాలపు చర్యల్ని గుర్తుచేసి మరీ తిట్టడంతో పాటు నీ ప్రతిపాదనల్ని నీ దగ్గరే పెట్టుకోమంటూ తోసిరాజని వెళ్లిపోయాయి.

ఈ భేటీ తరువాత...ఇంకా పాకులాడితే...

ఈ భేటీ తరువాత...ఇంకా పాకులాడితే...

ఈ అఖిలపక్షం అస్త్రం తుస్సుమందన్న సంగతి అందరికీ కనిపిస్తూనే ఉన్నా లేదు బానే వర్కౌట్ అయిందని అందరికీ తెలియాలనే ఇగో ఒకటి. ఆ కారణంగా కొన్ని తన అనుకూల సంఘాల అండ చూసుకొని తీర్మానాన్ని ఆమోదించినట్లు చేసి దాని ఫలితం చూసుకోండంటూ ఒక బిసి కాలం నాటి ఉద్యమ పోరాట కార్యాచరణకు చంద్రబాబు పిలుపునిచ్చారు. అయితే ఇది నూటికి ఒక్క శాతం కూడా విజయవంతం అయినట్లు ఎక్కడా కనిపించలేదు. ఇంకా చెప్పాలంటే తన ఉద్యమ పోరాట కార్యాచరణ తీర్మానంలో సంతకం చేసినావాళ్లే దీన్ని పాటించలేదు.

ఇదే ఉదాహరణ...మీరే చూడండి...

ఇదే ఉదాహరణ...మీరే చూడండి...

అందుకు అత్యుత్తమ ఉదాహరణ ఇందులో అత్యంత ప్రధానమైన నల్లబ్యాడ్జీలతో నిరసనకు ప్రజలు ఏ మాత్రం స్పందించకపోగా చివరకు పార్టీ వాళ్లు...ఇంకా చెప్పాలంటే మంత్రులు సైతం దీన్ని పిచ్చ లైట్ గీ తీసుకున్న పరిస్థితి. అందుకు సాక్ష్యం కావాలంటే మీరే చూడొచ్చు. అమరావతిలో విదేశీ పెట్టుబడులతో ప్రారంభం కానున్న ఓ కంపెనీ ప్రారంభోత్సావానికి సదరు ఫారినర్లతో కలసి పాల్గొన్న ఈ కార్యక్రమంలో సాక్షాత్తూ సిఎం చంద్రబాబు...ఆయన కుమారుడు, ఐటి మంత్రి లోకేష్ నల్ల రిబ్బన్లు పెట్టుకొని పాల్గొనగా, అక్కడ వీరిద్దరు తప్ప ఇదే కార్యక్రమంలో పాల్గొన్న మరో మంత్రి గంటా శ్రీనివాసరావు గాని, ఇతర అధికారులు గాని ఎవరూ నల్లరిబ్బన్లు ధరించకపోవడం వాళ్లు ఈ నిరసనను ఎంత లైట్ గా తీసుకున్నారో అర్ధం అవుతోంది.

 వచ్చినా లాభమే...రాకున్నా లాభమే...విన్ విన్ ప్లాన్...

వచ్చినా లాభమే...రాకున్నా లాభమే...విన్ విన్ ప్లాన్...

దీంతో పరిస్థితి అర్థం అయిన చంద్రబాబు ఇక ఇలా లాభం లేదని...అసలు ముందు ప్రతిపక్షాల మీద తాను ఎంతో కొంత ఆధిపత్యం కనబర్చి తన నాయకత్వ పటిమ నిరూపించుకోవాలని పట్టుదలతో ఉన్నారట...అందుకోసమే మరోసారి తన నేతృత్వంలో అఖిలపక్షం నిర్వహించి ఆ రకంగా అందరికీ దిశానిర్దేశం చేసినట్లు కనిపించాలని తహతహలాడుతున్నారట. అందుకోసమే ఈసారి అఖిలపక్షానికి ప్రతిపక్షాలను ఆహ్వానించే పనిని ప్రత్యేకంగా మంత్రులకు అప్పచెప్పారట. ఆ రకంగా వారితో అందరికీ తెలిసేలా ఘన మర్యాదలతో విపక్షాలను ఆహ్వానింపచేస్తారట. అలా వాళ్లు వస్తే తాను నేతృత్వం వహించిన ఘనత... రాకుంటే చూశారా...ఎంతో మర్యాదగా పద్దతిగా పిలిచినా ప్రతిపక్షాలు రాలేదంటే అసలు వారికి రాష్ట్రం బాగు మీద దృష్టి ఉందా అని బద్నాం అయినా చేయొచ్చనేది వ్యూహమట...వాళ్లు అఖిలపక్షానికి హాజరైతే తాను నేతృత్వం వహించిన ఘనత...అంటే వాళ్లు వచ్చినా తనకే లాభం...రాకున్నా తనకే లాభం...అందుకే ఈ వ్యూహానికి ప్రతిపక్షాలు చిత్తుకావడం ఖాయమని మంచి ధీమాతో ఉన్నారట బాబుగారు. అయితే ఇటీవలికాలంలో ఇలాగే ఎన్నో వ్యూహాలు పన్ని చివరకు తానే బుక్కయిపోయిన పరిస్థితి చంద్రబాబు గారిది...మరి రెండోసారి ప్రయోగిస్తున్న ఈ అఖిలపక్షం అస్త్రం ఈసారి ఏం చేస్తుందో చూద్దాం...

English summary
Amaravathi: The TDP chief Chandrababu will be hold again an all-party party meeting very soon over the non-issuance of 'Special Category Status' to Andhra Pradesh. Chandrababu is trying to attend all the opposition parties for the this second all party meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X