ఆ ధరల తగ్గింపుతో సామాన్య మధ్యతరగతి ప్రజలకు కేంద్రం శుభవార్త!
కేంద్ర ప్రభుత్వం సామాన్య మధ్యతరగతి ప్రజలకు మరో శుభవార్త చెప్పింది. ఇప్పటికే ఆదాయపు పన్ను పరిమితిని 12 లక్షలకు అమాంతం పెంచి మధ్యతరగతి ప్రజలకు ఊరట కల్పించిన కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త చెప్పేందుకు రెడీ అయింది. మధ్యతరగతి ప్రజలకు మరియు తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలకు ఎక్కువగా వినియోగించే వస్తువుల పైన జిఎస్టి తగ్గించాలని కేంద్రం భావిస్తోంది.
ఆ వస్తువులపై జీఎస్టీ తగ్గించే ఆలోచనలో కేంద్రం
ఈ క్రమంలోనే ప్రస్తుతం 12 శాతంగా ఉన్న జిఎస్టి స్లాబ్ ను పూర్తిగా తొలగించాలని లేదా 12 శాతం లో ఉన్న చాలా వరకు వస్తువులను ఐదు శాతం పరిధిలోకి తీసుకురావాలని కేంద్రం చూస్తోంది. తద్వారా సామాన్య మధ్యతరగతి ప్రజలకు జిఎస్టి భారాన్ని తగ్గించాలని కేంద్రం భావిస్తోంది. ఇక జిఎస్టి భారాన్ని తగ్గిస్తే దాని ప్రభావం చిన్న స్థాయి బిజినెస్ ల పైన కూడా కనిపిస్తుంది.

సామాన్య, మధ్యతరగతి ప్రజలపైన భారం తగ్గింపు
ప్రస్తుతం సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఆదాయం పెరగక ప్రతి నెల ఖర్చులు పెరిగి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం పలు వస్తువులపై విధిస్తున్నటువంటి జిఎస్టి భారాన్ని తగ్గిస్తే, ఇది సామాన్య, మధ్యతరగతి ప్రజలపైన భారాన్ని తగ్గించినట్లు అవుతుంది. ప్రస్తుతం జీఎస్టీ వసూళ్లు రెండు లక్షల కోట్లకు చేరుకోవడం దేశ ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉందని చూపిస్తుంది .
నిత్యవసర వస్తువులను చౌకగా అందించడానికి కేంద్రం రెడీ
ఈ స్థిరతను ఉపయోగించి ప్రభుత్వం సామాన్య కుటుంబాల పైన ఆర్థిక భారాన్ని తగ్గించడానికి చర్యలు తీసుకుంటే ప్రజలకు ప్రభుత్వం పైన నమ్మకం కలుగుతుంది.ఈ క్రమంలోనే జిఎస్టి స్లాబ్ విషయంలో కొత్త నిర్ణయంతో కొన్ని నిత్యవసర వస్తువులను చౌకగా అందించడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది.
ఈ వస్తువుల ధరలు తగ్గే అవకాశం
టూత్ పేస్టులు, టూత్ పౌడర్లు, గొడుగులు, కుట్టుమిషన్లు, ప్రెషర్ కుక్కర్లు, వంటింటిపాత్రలు, స్మాల్ కెపాసిటీ వాషింగ్ మెషిన్లు, సైకిళ్లు, వెయ్యిరూపాయలు కంటే ఎక్కువ ధర కలిగిన రెడీమేడ్ దుస్తులు, 500 రూపాయల నుంచి వెయ్యి రూపాయల మధ్య ధరకలిగిన బూట్లు, వస్తువులు, వ్యాక్సిన్లు, సిరామిక్ టైల్స్ పరికరాలు మొదలైనవి ధరలు తగ్గే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇదే గనుక జరిగితే భవిష్యత్తులో ఈ వస్తువులన్నీ చౌకగా లభించే అవకాశం కనిపిస్తుంది.
కేంద్ర నిర్ణయంతో కేంద్రంపై భారం
అయితే ప్రభుత్వం తీసుకునే ఈ నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వం పైన 40,000 కోట్ల రూపాయల నుండి, 50 వేల కోట్ల రూపాయల వరకు భారం పడుతుందని నివేదిక పేర్కొంది. అయితే ఈ చౌక వస్తువుల వల్ల వినియోగం కూడా పెరుగుతుందని, వినియోగం పెరిగినప్పుడు జీఎస్టీ వసూలు కూడా పెరుగుతాయని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications