సంచలనం: లారీ టూల్ బాక్స్‌లో మహిళ అస్తిపంజరం

2011 మే 5న కేసు కొట్టి వేయడంతో లారీని తీసుకెళ్లాలని పోలీసులు చెప్పారు. ఈ నేపథ్యంలో సోమవారం లారీ ఓనర్ చెన్నపురెడ్డి, డ్రైవర్ బాలరాజు జేసీబీ సహాయంతో శిథిలావస్థలో ఉన్న లారీని తొలగించేందుకు సిద్ధమయ్యారు. లారీని కదిలిస్తుండగా టూల్ బాక్స్‌లో మహిళ అస్థిపంజరం బయట పడింది.
దుస్తులను బట్టి అది బిజినేపల్లికే చెందిన ఇరుగంటి లక్ష్మమ్మ (35)అనే మహిళదిగా గుర్తించారు. రెండు సంవత్సరాల క్రితం మతిస్థిమితం కోల్పోయి ఆమె అదృశ్యమైందని లక్ష్మమ్మ తమ్ముడు ఆంజనేయులు చెప్పాడు. ఈ విషయంపై వీఆర్వో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మూసీలో దూకి మహిళ ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్ నగరంలోని అత్తాపూర్ మధ్య ఉన్న మూసీనదిలో దూకి అపర్ణ అనే మహిళ సోమవారం ఉదయం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందిండంతో వారు అక్కడకు చేరుకుని మహిళను రక్షించి ఆస్పత్రికి తరలించారు. కుటుంబ కలహాలే ఆత్మహత్యాయత్నానికి కారణంగా పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications