భర్తను వల్లో వేసుకుందని మహిళను కట్టేసి కొట్టింది

ముగ్గురు పిల్లలు ఉన్న తన భర్తను మాయమాటలతో నాగమణి లోబరుచుకుందని హసీనా ఆరోపించింది. అయితే, అల్లావుద్దీన్ తనను పెళ్లి చేసుకున్నాడని, మొదటి భార్యను ఒప్పించి కాపురం పెట్టిస్తానని ఇక్కడికి తీసుకుని వచ్చాడని నాగమణి చెబుతోంది.
ఇదిలావుంటే, గొడవ జరుగుతుండగానే అల్లావుద్దీన్ అక్కడి నుంచి పారిపోయాడు. గ్రామస్థులు అడ్డుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని చికిత్స నిమిత్తం నాగమణిని వరంగల్ ఎంజిఎం ఆస్పత్రికి పంపించారు.
ఈ సంఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. గ్రామస్తులు ఈ సంఘటనను చూసి నివ్వెరపోయారు.












Click it and Unblock the Notifications