తప్పించుకోలేరు, లెక్క తేలుస్తాం - పేర్ని నాని..!!
వైసీపీ శ్రేణుల పైన కేసుల విషయంలో ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు. పోలీసు శాఖలో కొందరు అధికారులు పచ్చ చొక్కా లు వేసుకొని పని చేస్తున్నారని మండిపడుతున్నారు. అదే సమయంలో అధికారం శాశ్వతం కాదని.. వేధించిన వారు చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం వైసీపీ నేతల వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి.
వైసీపీ కార్యకర్తల అరెస్ట్ పై మాజీ మంత్రి పేర్ని నాని ఘాటుగా వ్యాఖ్యలు చేసారు. అధికారం శాశ్వతం కాదని..అధికారం ఎప్పుడూ ఉండదని చంద్రబాబు అండ్ టీం గుర్తుంచుకోవాలని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను చంద్రబాబు సర్కార్ గాలికొదిలేసిందని మండి పడ్డారు. ప్రభుత్వాన్ని వైసీపీ నేతలు, కార్యకర్తలు ప్రశ్నిస్తే వారిని టార్గెట్ చేయటమే పనిగా పెట్టుకుందని ఆరోపించారు. తప్పుడు కేసులతో వైసీపీ శ్రేణులను వేధించటం కోసమే పోలీసు వ్యవస్థను వినియోగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు.

తప్పుడు కేసులు పెడుతున్నారని పేర్ని నాని ధ్వజమెత్తారు. పాత కేసులను తిరగదోడి వేధిస్తున్నా రని ఆరోపించారు. గన్నవరంలో 8 మంది వైసీపీ నేతలను అక్రమంగా కేసుల్లో ఇరికించారని ఆగ్రహం వ్యక్తం చేసారు. న్యాయమూర్తి 307 కేసును తొలగించారని చెప్పారు. రెండు సార్లు విచారణ అయ్యాక ఏముందని పోలీస్ కస్టడీకి కోరుతున్నారని పేర్ని నాని ప్రశ్నించారు. అమయకు ల ను తీసుకొచ్చి ముద్దాయిలను చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ జెండా, జగన్ బొమ్మపెట్టుకుని తిరగకుండా చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. తమతో పాపాలు చేయిస్తున్నారని కొందరు పోలీసు అధికారులు బాధపడుతున్నారని చెప్పుకొచ్చార. అధికార పార్టీ కోసం పని చేస్తున్న వారు భవిష్యత్ లో తగిన మూల్యం చెల్లించుకుంటారని నాని హెచ్చరించారు.
-
ఎల్పీజీ స్ధానంలో PNG కనెక్షన్ తీసుకుంటే - ఏపీ సర్కార్ భారీ సబ్సిడీ ఆఫర్ ..! -
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
ఏపీ సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ భేటీ..! -
AP Property Tax: ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు బిగ్ అలర్ట్..! ఇంకా ఐదు రోజులే ఆఫర్.. -
ఏపీలో పర్యాటకానికి మహర్దశ.. కీలక ఆదేశాలిచ్చిన సీఎం చంద్రబాబు -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!!












Click it and Unblock the Notifications