కడపలో వైఎస్సార్ గురించి చెప్పి , చిత్తూరులో చంద్రబాబు విషయం చెప్పలేదే..నిమ్మగడ్డపై మంత్రి సెటైర్లు
నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై ఏపీ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సెటైర్లు వేశారు. మొన్న కడపలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ వైయస్సార్ గురించి బాగా చెప్పారని ఆయన దగ్గర పని చేసినట్టు చెప్పుకున్నారని పేర్కొన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చిత్తూరులో ఓటుకు నోటు కేసు గురించి కూడా మాట్లాడాలి కదా, చంద్రబాబు దగ్గర కూడా పని చేశానని చెప్పాలి కదా అంటూ సెటైర్లు వేశారు.

బెదిరింపులకు పాల్పడినందుకు కేసులు పెడితే వేధింపుల ఆరోపణలా ?
ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ బలవంతపు ఏకగ్రీవాలు వద్దని చెబుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఇదే మాట చెప్పారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఏవిధంగా బెదిరించాడో అందరూ చూశారని పేర్కొన్న ఆయన, బెదిరింపులకు పాల్పడినందుకు కేసు పెడితే వేధింపులకు గురి చేస్తున్నారు అంటూ గగ్గోలు పెడుతున్నారని విమర్శించారు. నిమ్మాడలో దువ్వాడ శ్రీనివాస్ కి ఏం పని అని ప్రశ్నిస్తున్నారు అన్న ఆయన, తామేదో కుట్ర చేశామని ఆరోపిస్తున్నారు అంటూ మండిపడ్డారు.
బాత్ టబ్‌లో యువ హీరోయిన్ ప్రియా బెనర్జీ హాట్ ఫోటోషూట్..

ఉత్తరాంధ్రపై కక్ష కట్టారని టిడిపి నేతలు చేస్తున్న విమర్శలు దారుణం
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై కూడా ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జగన్మోహన్ రెడ్డి కూడా ఉత్తరాంధ్రపై కక్ష కట్టారని టిడిపి నేతలు చేస్తున్న విమర్శలు దారుణమన్నారు.
దాడులకు పాల్పడుతూ, దౌర్జన్యాలకు దిగుతూ టిడిపి నేతలు వైసీపీపై బురద జల్లుతున్నారని విమర్శించారు. చిత్తూరు జిల్లాలో ఇళ్ల పట్టాలు ఇస్తుంటే టిడిపి నేతలు అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు. చేసేదంతా చేస్తూ తిరిగి తమపై ఆరోపణలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

టిడిపి వాళ్ళు దౌర్జన్యం చేస్తుంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏమీ చెయ్యటం లేదన్న పెద్దిరెడ్డి
తాము ఎక్కడా బలవంతపు ఏకగ్రీవాలు చేయడం లేదని పేర్కొన్న మంత్రి ఏకగ్రీవాలని అడ్డుకోవాలని చంద్రబాబు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాట్లాడుకుంటున్నారని విమర్శించారు.నిమ్మగడ్డ టిడిపికి సహకరిస్తూ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టిడిపి వాళ్ళు దౌర్జన్యం చేస్తుంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏమీ చేయడం లేదన్నారు. దళితులపై టిడిపి నాయకులు దౌర్జన్యాలు చేస్తున్నారని మండిపడ్డారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.
Recommended Video

ఎన్నికల కమిషన్ కు సంబంధించిన యాప్ టీడీపీ యాప్ లానే ఉంది
గవర్నర్ ను బెదిరించే ధోరణితో లేఖ రాశారని తాను, మంత్రి బొత్స సత్యనారాయణ చాలా బాధపడ్డామని పేర్కొన్నారు. తమకు అగౌరవం కలిగేలాగా నిమ్మగడ్డ వ్యవహరించారని,అందుకే ప్రివిలేజ్ కమిటీ దృష్టికి తీసుకు వెళ్ళామని చెప్పారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. టిడిపి చెప్పేదొకటి చేసేదొకటి అని ప్రజలే ఏం చెయ్యాలో నిర్ణయిస్తారని పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ కు సంబంధించిన యాప్ గురించి విమర్శలు గుప్పించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆ యాప్ టిడిపి యాప్ లానే ఉందని ఆరోపించారు. రేపు యాప్ విడుదల చేసిన తర్వాత యాప్ పై స్పందిస్తాం అన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.












Click it and Unblock the Notifications