బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, చంద్రబాబులను ఏకిపారేసిన రోజా .. బాలయ్య ఆ సైగ అప్పుడు చెయ్యాల్సింది
నగరి వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్ రోజా టీడీపీ అధినేత చంద్రబాబు , బాలకృష్ణలతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏ మాత్రం చిన్న అవకాశం దొరికినన వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లను టార్గెట్ చేసుకుని విరుచుకుపడుతున్నారు. మాటల తూటాలు పేలుస్తున్నారు. ప్రతిపక్షాల మీద విరుచుకుపడటంలో రోజా దూకుడు చూపిస్తున్నారు.
Recommended Video

అప్పుడు చంద్రబాబుకు బాలకృష్ణ సైగ చేసి బుద్ధి చెప్పి ఉంటే బాగుండేదన్న రోజా
ఇటీవల హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ హిందూపురంలో తనను వైసీపీ కార్యకర్తలు అడ్డుకుని నిరసన వ్యక్తం చెయ్యటంపై స్పందిస్తూ తాను ఒక్క కనుసైగ చేసి ఉంటె ఏమయ్యేదో తెలుసా అంటూ చేసిన వ్యాఖ్యకు రోజా కౌంటర్ ఇచ్చారు . ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు బాలకృష్ణ సైగ చేసి బుద్ధి చెప్పి ఉంటే బాగుండేదని రోజా వ్యాఖ్యానించారు . అంతేకాదు రాయలసీమ నుంచి చంద్రబాబును, బాలకృష్ణను తరిమికొట్టే రోజు వస్తుంది అని ఆమె తీవ్ర విమర్శలు చేశారు .

పవన్ కు జీవోల గురించి ఏమీ తెలీదన్న నగరి ఎమ్మెల్యే
ఇక జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌కు జీవోల గురించి ఏమాత్రం తెలియదన్నారు ఎమ్మెల్యే రోజా . చీకటి జీవోలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇక పవన్ కూడా అదే బాటలో సాగుతున్నారని విమర్శలు గుప్పించారు . ఇక టీడీపీ జాతీయ కార్యదర్శి మాజీ మంత్రి లోకేష్ పై కూడా రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు.పెద్దల సభకు పెద్దలను తీసుకురాకుండా దద్దమ్మలను తీసుకొచ్చారని రోజా ఆరోపించారు . ఇక మండలిలో చంద్రబాబు భజనపరులే ఉన్నారని ఆమె నిప్పులు చెరిగారు .

లోకేష్ రాజకీయ భవిష్యత్ సమాధి అవుతుందన్న రోజా
ఇక అలాంటి భజనపరులు మండలిలో వారు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అని రోజా పేర్కొన్నారు. ఇక చంద్రబాబు తనయుడు లోకేష్ ఎమ్మెల్యేగా గెలవలేరని ఆమె ఎద్దేవా చేశారు . లోకేష్ రాజకీయ భవిష్యత్ సమాధి అవుతుందని ఆమె పేర్కొన్నారు. కాబట్టే మండలి రద్దును చంద్రబాబు అడ్డుకుంటున్నారు అని ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇక సీఎం జగన్ మూడు రాజధానుల నిర్ణయానికి కట్టుబడి పాలన సాగిస్తున్నారని, పరిపాలనా వికేంద్రీకరణ చేసి తీరతారని ఆమె అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications