Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

100 రూపాయల స్టాంప్ పేపర్ పై సంతకం చేసి సవాల్ విసిరిన రాప్తాడు వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ..!

ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో రాజకీయాలు కాక పుట్టిస్తున్నాయి. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కొడిమి జగనన్న కాలనీలో కార్మికులను కిడ్నాప్ చేశారని టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఆ ఆరోపణలను వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కొట్టిపారేశారు. కావాలని తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

రాప్తాడు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి పరిటాల సునీత జీర్ణించుకోలేకపోతున్నారని, అందుకే పరిటాల సునీత ఆరోపణలు మొదలు పెట్టారని ఆయన మండిపడ్డారు . అనంతపురం ఆర్ అండ్ బి అతిథి గృహంలో మీడియాతో మాట్లాడిన ఆయన తనపై వస్తున్న ఆరోపణలకు ఘాటుగా స్పందించారు. రాప్తాడు నియోజకవర్గం కొడిమి జగనన్న కాలనీలో శాన్వి లోటస్ సంస్థల మధ్య ఒప్పందం జరిగిందని ఆయన వివరించారు.

 YCP MLA Topudurthi Prakash Reddy Challenge with 100 rupees stamp paper!!

పేదలకు ఇళ్ల నిర్మాణం త్వరితగతిన పూర్తయ్యేలా తాను చర్యలు తీసుకున్నానని ఆయన పేర్కొన్నారు. శాన్వి సంస్థ నుంచి 55 లక్షల రూపాయలు అడ్వాన్స్ గా తీసుకున్న లోటస్ సంస్థ ప్రతినిధులు పనులు చేయకుండా వెళ్లిపోయారని ఆయన ఆరోపించారు. శాన్వి సంస్థ ప్రతినిధుల ఫిర్యాదుతో కలకత్తా కార్మికులను అదుపులోకి తీసుకున్నారని, దీనిని తప్పుగా తెలుగుదేశం పార్టీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే తోపుదుర్తి మండిపడ్డారు.

పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్, సిపిఐ నేత రామకృష్ణ, ఎల్లో మీడియా తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడిన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తప్పుడు ప్రచారం చేసే వారిపై తను పరువు నష్టం దావా వేస్తానని మండిపడ్డారు. తనకు రెండు వేల కోట్ల రూపాయల అక్రమాస్తులు ఉన్నాయని చంద్రబాబు ఆరోపణలు చేశారని, ఇక ఎల్లో మీడియా తనకు 500 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని ప్రచారం చేస్తుందన్నారు.

కనీసం తనకు ఎవరైనా 50 కోట్ల రూపాయలు ఇస్తే తనపై ఉందని చెప్తున్న ఆస్తులన్నీ రాసిస్తానని ఆయన 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద సంతకం చేసి టిడిపి నాయకులకు సవాల్ విసిరారు వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+