పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయమంత్రినా.. వైసీపీ సెటైర్లు, టీడీపీ కౌంటర్!!
టిడిపి బిజెపి జనసేన కూటమి అభ్యర్థిగా గుంటూరు లోక్సభ నియోజకవర్గం నుంచి గెలిచిన డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ నక్క తోక తొక్కిన విషయం తెలిసిందే. తాజాగా ఆయనను కేంద్ర మంత్రి పదవి వరించడంతో నరేంద్ర మోడీ నేతృత్వంలో నూతన ఎన్డీఏ ప్రభుత్వంలో సహాయ మంత్రిగా ఆయన ప్రమాణస్వీకారం చేశారు.
ఏపీలో పెమ్మసానిపై చర్చ
ప్రస్తుతం ఆయనకు గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖలను కేటాయించారు. ఈ శాఖలకు పెమ్మసాని చంద్రశేఖర్ సహాయ మంత్రిగా పనిచేయనున్నారు. పెమ్మసాని చంద్రశేఖర్ పోటీ చేసిన తొలిసారే ఎంపీగా గెలవడం, మంత్రి పదవి కూడా దక్కడంతో ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా ఆయన పైన ఆసక్తికర చర్చ జరుగుతుంది పార్లమెంటు సభ్యుడుగా ప్రమాణస్వీకారం చేసి లోక్సభలో ప్రవేశించక ముందే నేరుగా ఆయన కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం కూడా ఆసక్తిని రేకెత్తిస్తుంది.

సోషల్ మీడియాలో పెమ్మసానిని టార్గెట్ చేసిన వైసీపీ
ఇదిలా ఉంటే ప్రస్తుతం వైసీపీ శ్రేణులు పెమ్మసాని చంద్రశేఖర్ ను టార్గెట్ చేసి సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. సోషల్ మీడియాలో కొందరు వైసీపీ సపోర్టర్లు పెమ్మసాని చంద్రశేఖర్ పై సెటైర్లు వేస్తున్నారు. 25 ఏళ్లకు పైగా యూఎస్ లో గడిపిన వ్యక్తి భారతదేశంలో గ్రామీణ అభివృద్ధి కోసం పని చేస్తాడట.. పెమ్మసానికి గ్రామీణ వాతావరణం ఏం తెలుసు అని ప్రశ్నిస్తున్నారు.
జగన్ టార్గెట్ గా టీడీపీ కౌంటర్
భారత ప్రభుత్వమే ఒక జోక్ లా ఉంది అంటూ ఎక్స్ వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఇక దీనికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు స్పందిస్తూ 16 నెలలు జైలులో ఉన్న వ్యక్తి సీఎం అవ్వలేదా అని కౌంటర్ ఇస్తున్నారు. 16 నెలలు జైల్లో ఉన్న వ్యక్తి రాష్ట్రాన్ని పాలించే సీఎం కావచ్చు కానీ పెమ్మసాని మంత్రి కాకూడదా అంటున్నారు.
పెమ్మసానికి కేంద్ర సహాయ మంత్రి పదవిపై ఏపీలో చర్చ
25 సంవత్సరాలు యుఎస్ లో ఉన్నంత మాత్రాన పెమ్మసాని చంద్రశేఖర్ కు గ్రామీణ అభివృద్ధి శాఖకు పని చేసే అర్హత లేదా అంటూ ఘాటుగా బదిలిస్తున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం రాష్ట్రంలో మొదటిసారి పోటీ చేసి గెలుపొంది, కేంద్ర మంత్రిగా అవకాశం దక్కించుకున్న పెమ్మసాని చంద్రశేఖర్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications