వరదల వేళ కృష్ణలంక రిటైనింగ్ వాల్ పై టీడీపీ వర్సెస్ వైసీపీ!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడలో కృష్ణానది వద్ద కట్టించిన రిటైనింగ్ వాల్ వ్యవహారం ఏపీలో వరదలు కొనసాగుతున్న క్రమంలో వైసిపి, టిడిపి వర్గాల మధ్య మాటల యుద్ధానికి కారణంగా మారింది. ఓవైపు విజయవాడను వరదలు ముంచెత్తి అనేక ప్రాంతాల ప్రజలు తమ ఇళ్లను వదిలి పునరావస కేంద్రాలకు తరలి వెళ్లి ఇబ్బందులు పడుతుంటే టిడిపి, వైసిపి శ్రేణులు కృష్ణలంక వద్ద నిర్మించిన రిటైనింగ్ వాల్ వ్యవహారంపైన సోషల్ మీడియా వేదికగా తిట్టిపోసుకుంటున్నారు.

జగన్ హయాంలోనే కృష్ణ లంక రిటైనింగ్ వాల్ నిర్మాణం అంటున్న వైసీపీ
తాజాగా వైసిపి విజయవాడలో గత వైసిపి సర్కార్ తీసుకున్న చొరవతో నిర్మించిన రిటైనింగ్ వాల్ కారణంగా 80,000 మందికి ముంపు బాధ తప్పిందని పేర్కొన్నారు. జగన్ ముందుచూపు కారణంగా నిర్మించిన రిటైనింగ్ వాల్ ప్రజలను ముంపు నుంచి కాపాడుతుందని వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో ఊదరగొడుతున్నారు.

YCP vs TDP fight for credit during floods on the construction of Krishna Lanka retaining wall

సోషల్ మీడియాలో వైసీపీ పోస్టులు
జగన్ హయంలోనే రిటైనింగ్ వాల్ నిర్మాణం జరిగిందని 12 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చినప్పటికీ చుక్కనీరు ఇళ్లల్లోకి రాకుండా 474.51 కోట్లతో కృష్ణ నది వెంబడి రిటైనింగ్ వాల్ నిర్మించారని వైయస్ జగన్ దార్శనికత వల్లే అనేక ప్రాంతాలు ముంపుకు గురి కాలేదని వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

జగన్ కు కృష్ణలంక వాసుల కృతజ్ఞతలు అంటూ పోస్టులు
ఇక వైసిపి కూడా తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో విజయవాడ కృష్ణలంక ఏరియాలో రిటైనింగ్ వాల్ దగ్గర కృష్ణా నది ప్రవాహాన్ని పరిశీలించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు కృష్ణలంక ప్రజలు కృతజ్ఞతలు తెలిపారని జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కట్టించిన రిటైనింగ్ వాల్ వల్లే తమ ప్రాణాలు నిలిచాయని కృష్ణలంక వాసులు చెబుతున్నారని పోస్ట్ పెట్టింది.

మండిపడిన టీడీపీ, రివర్స్ ఎటాక్

ఇక ఈ పోస్టులపైన తెలుగుదేశం శ్రేణులు మండిపడుతున్నారు. కృష్ణలంక వద్ద రిటైనింగ్ వాల్ 2019లో చంద్రబాబు హయాంలో నిర్మించబడిందని కృష్ణలంక ప్రజలకు మేలు చేసింది జగన్ కాదు చంద్రబాబు అంటూ పోస్టులు పెడుతున్నారు. మీరు అబద్ధాలు చెప్పినా గూగుల్ అబద్ధం చెప్పదు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. తెలుగుదేశం పార్టీ అధికారిక ఎక్స్ ఖాతాలో కూడా నాడు చంద్రబాబు హయాంలో పూర్తయిన రిటైనింగ్ వాల్ విజువల్స్ పోస్ట్ పెట్టారు.

చంద్రబాబు హయాంలోనే కృష్ణలంక రిటైనింగ్ వాల్
ఇదే సమయంలో చంద్రబాబు చేసిన పనిని నీ కూలి మందచేత నీ పని అని చెప్పించుకుని తృప్తి పడుతున్నావా ఫేక్ ఫెలో అంటూ జగన్ ను టార్గెట్ చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇలా ఫేక్ ప్రచారం చేసే కృష్ణలంక ప్రాంతంలో అడ్రస్ లేకుండా పోయావంటూ టార్గెట్ చేశారు. తూర్పులో 50వేల ఓట్లతో ఓడిపోయావని ఎద్దేవా చేశారు. ఇది చంద్రబాబు హయాంలో పూర్తి చేసిన కృష్ణలంక రిటైనింగ్ వాల్ అంటూ వీడియో పెట్టి జగన్ ను టార్గెట్ చేసింది టిడిపి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+